ప్రముఖ య్యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉన్నాడు. తనపై లైంగిక దాడి చేశాడని, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి నార్సింగి పోలీసులను ఆశ్రియించింది. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు చేయగా వాటి రిపోర్ట్ పోలీసులకు అందింది. దీంతో విచారణ వేగవంతం చేశారు. అయితే హర్ష సాయి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండగా, బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.