AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు రిమాండ్‌ను పొడిగించారు. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి కోర్టులో ఆయనను పోలీసులు హాజరుపరిచారు. ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.