AP: దానా తుఫాన్ రేపు అర్ధరాత్రి పూరి-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావం ఏపీతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాపై కూడా ఉండనుంది. ఈ క్రమంలో అధికారులు ఉత్తరాంధ్ర, రాయలసీమలో హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 120కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.