AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘చంద్రబాబుకు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు మారింది. అధికారంలోకి రావడమే ఆలస్యం.. పోలవరం ఎత్తు తగ్గించి ప్రజలను ద్రోహం చేస్తున్నారు. ప్రాజెక్టు నిధులను దారిమళ్లిస్తున్నారు. ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే తాగు, సాగునీటి అవసరాలకు.. తీవ్ర విఘాతం కలుగుతుంది. చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి’ అని పేర్కొన్నారు.