AP: ఇవాళ గుంటూరు, కడప జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. గుంటూరులో యువకుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయి మరణించిన యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం బద్వేల్‌కు బయలుదేరనున్నారు. అక్కడ ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబసభ్యులను కలిసి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.