TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ జరిగింది. ఈ విచారణకు విశ్రాంత ENC నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కాళేశ్వరం DPRను అప్పటి సీఎం కేసీఆర్ ఆమోదించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలను కమిషనర్‌కు అందించారు. మూడు బ్యారేజీల్లో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. అప్పటి ప్రభుత్వాధినేత ఆదేశించారని వెంకటేశ్వర్లు బదులిచ్చినట్లు సమాచారం.