తెలుగులో నంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్ సక్సెస్ కాగా… సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో అదరగొట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ రావడం.. అది కూడా చంద్రబాబు ఇలాంటి షోకి రావడం మొదటిసారి కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ఆ ఎపిసోడ్ హిట్ కావడంతో… బాలయ్య వరసగా షోలోతో అదరగొడుతున్నాడు. చంద్రబాబు తర్వాత.. సిద్దు, విశ్వక్ సేన్ వంటి యువ హీరోలతో షో చేశాడు. దానికి కూడా రెస్పాన్స్ చాలా పాజిటివ్ గా వచ్చింది. అయితే.. తాజాగా ఈ షోకి సంబంధించి ఒక ఊహించని వార్త బయటకు వచ్చింది.
వైఎస్సార్ తెలంగాణ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయిన వైఎస్ షర్మిళ(YS Sharmila) ‘అన్స్టాపబుల్’లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ఒకప్పుడు అన్న జైల్లో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసిన షర్మిళ.. తర్వాత జగన్ తనకు అన్యాయం చేశాడన్న కారణంతో ఆయన్నుంచి దూరంగా వచ్చి తెలంగాణలో వైఎస్సార్ టీపీ పార్టీ పెట్టింది. జగన్ ఎప్పుడూ బద్ద శత్రువుగా భావించి ఏబీఏఎన్ రాధాకృష్ణకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం రేపింది. ఇటీవలి పరిణామాలు చూసినా జగన్కు, షర్మిళకు పడట్లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో ‘అన్స్టాపబుల్’ను కొంత మేర తన రాజకీయ ప్రయోజనాలకు కూడా ఉపయోగించుకుంటున్న బాలయ్య షర్మిళను షోకు తీసుకొచ్చి జగన్ను టార్గెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ షో చివరి ఎపిసోడ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అతిథిగా వస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ వచ్చినా జగన్ను టార్గెట్ చేస్తారని వేరే చెప్పాల్సిన పని లేదు. అంతకంటే ముందు నిజంగా షర్మిళ వచ్చేట్లయితే జగన్ మీద ఎలాంటి బాంబులు వేస్తుందో..చూడాలి మరి. నిజంగా షర్మిల బాలయ్య షోకి వస్తే..హైలెట్ అయినట్లే.