»Vk Naresh Revealed About His Property For The First Time
Naresh: వామ్మో.. నరేష్ కు అన్ని వేల కోట్ల ఆస్తి ఉందా !
తెలుగు ప్రేక్షకులకు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈ మధ్య నటనతో కాకుండా వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
Naresh: తెలుగు ప్రేక్షకులకు వీకే నరేష్(VK naresh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా చేసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈ మధ్య నటన(Acting)తో కాకుండా వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పవిత్ర లోకేష్(Pavitra lokesh) తో ప్రేమాయణంతో బాగా ఫేమస్ అయ్యారు. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి(Malli pelli) సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు(Ms Raju) దర్శకత్వం వహించగా ఈనెల 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ బాగానే ఆకట్టుకుంటున్నాయి. సినిమా రిలీజ్ టైం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.
ఇందులో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.. ఇంటర్వ్యూలో నరేష్(Naresh) తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇక మొదటి నుంచి నరేష్ కు ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది..అందుకే పవిత్ర అతని వెంట పడుతోందంటూ పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. నరేష్ తన ఆస్తి విలువ గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. నరేష్ మాట్లాడుతూ ‘అవును నేను బిలినియర్ ను.. రిచ్ పర్సన్ ను అందులో వారసత్వం వచ్చింది ఉంది.. నేను కష్టపడి సంపాదించింది ఉంది భూములు ధరలు పెరిగాయి. రూ.1000 కోట్లు కాదు అంతకుమించి ఉండవచ్చు నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు ఏది ఏమైనా. ప్రశాంతంగా ఆ డబ్బంతా వైటే.. అంతా బ్లాక్ అనుకునేరు.. ఎక్కడ ఏది కావాలన్నా చూపిస్తాను. ఎంతో బాధ్యతగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను.. చాలా ఆస్తి మా అమ్మ గారి దగ్గర నుంచే వచ్చింది.. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’. ఎంత డబ్బులున్నా మనతోపాటు పదిమందిని హ్యాపీగా ఉంచాలన్నారు.