ఈతకు వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు(Six people died). వారిలో ఐదుగురు విద్యార్థులు కాగా… ఒకరు ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఐదుగురు విద్యార్థులు ఈతకొడుతూ నీటిలో మునిగిపోతుండగా… వారిని కాపాడటానికి ప్రయత్నించి.. ఆ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మేడ్చల్(medchal) జిల్లా జవహర్ నగర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జవహార్‌నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. వీరంతా అంబర్‌పేటలోని మదర్సా విద్యార్థులుగా గుర్తించారు. చెరువులోకి ఐదుగురు విద్యార్థులు వెళ్లి ఈతకు వెళ్లి నీట మునిగారు.విద్యార్థులను రక్షించేందుకు వెళ్లి.. ఉపాధ్యాయుడు కూడా నీటమునిగాడు.
దుర్ఘటనలో మొత్తం ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారు. వీరంతా 12 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులేనని తేలింది.