Kodad: ఆయనకు టిక్కెట్ ఇస్తే మేం సహకరించం.. స్వపక్షంలోనే విపక్షం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఇక నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి బీఆర్ ఎస్(BRS) శత విధాలా కృషి చేస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసిన పార్టీ నేతలను అసమ్మతి రాజ్యమేలుతుంది. ప్రతిపక్షాల మాట పక్కన పెట్టి స్వపక్షనేతలే కొట్టుకు చావడం ప్రధానంగా బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతుంది. రాష్ట్రంలో ఆధిపత్య పోరుతో గులాబీ బాస్ సంతృప్తి చెందడం లేదు.
Kodad: తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఇక నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి బీఆర్ ఎస్(BRS) శత విధాలా కృషి చేస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసిన పార్టీ నేతలను అసమ్మతి రాజ్యమేలుతుంది. ప్రతిపక్షాల మాట పక్కన పెట్టి స్వపక్షనేతలే కొట్టుకు చావడం ప్రధానంగా బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతుంది. రాష్ట్రంలో ఆధిపత్య పోరుతో గులాబీ బాస్ సంతృప్తి చెందడం లేదు. ఇక సూర్యాపేట(suryapet) జిల్లా కోదాడ(KOdad)లో… పరిస్థితి మరీ దారుణం, కాస్త విచిత్రం. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Bollam Mallaiah Yadav )పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. కొంత కాలంగా ఎమ్మెల్యే మల్లయ్య తీరుపై పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు(former MLA Venepalli Chander Rao), పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి శశిధర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పాండురంగారావు, రాష్ట్ర కార్యదర్శి యెర్నేనిబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
శుక్రవారం తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోదాడలో అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు జెండాను ఆవిష్కరించి మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వారిని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈసారి కూడా ప్రస్తుత ఎమ్మెల్యేనే గెలిపించాలని మంత్రి జగదీశ్ రెడ్డి తమకు సూచించారని, అయితే తాము సహకరించబోమని మంత్రికి చెప్పామన్నారు. ఎమ్మెల్యే కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామని ప్రకటించారు. ‘‘గత ఎన్నికల్లో మేమంతా పార్టీ కోసం కష్ట పడి పనిచేశాం.. అప్పుడే పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించాం.. అప్పటి నుంచి ఎమ్మెల్యే నియంతలా ప్రవర్తిస్తూ.. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు. దందాలను ప్రోత్సహిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో హైకమాండ్ కోదాడ ఎమ్మెల్యే బొల్గం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వకూడదని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వెల్లడించారు.