టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిషబ్‌పంత్ యాక్సిడెంట్‌పై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.