RC 15 Leakage Damage! : RC 15.. ఇవేం లీకులు సామి! : ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ RC 15. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ RC 15. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. స్టూడియో, సెట్టింగుల కంటే.. పబ్లిక్ ప్లేసెస్‌లోనే ఆర్సీ 15 మేజర్ పార్ట్ షూట్ చేస్తున్నాడు శంకర్. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. రీసెంట్గా ఐకానిక్ ప్లేస్ చార్మినార్, కర్నూలు కొండా రెడ్డి బురుజు దగ్గర షూట్ చేశారు. అయితే ఇది చరణ్ ఇంట్రో సాంగ్ కావడంతో.. మళ్లీ RC 15 లొకేషన్ చేంజ్ అయ్యింది. ప్రజెంట్ వైజాగ్ గీతం యూనివర్సిటీలో సందడి చేస్తోంది చిత్ర యూనిట్. అయితే జనాల మధ్య షూటింగ్ చేస్తుండడంతో.. ఈ సినిమాకు లీకులు గోల ఎక్కువైపోయింది. చరణ్ ఫీల్డ్‌లోకి దిగడమే ఆలస్యం.. వెంటనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌ను హెలికాప్టర్లో షూట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో పాటు ఓ సాంగ్ బిట్ కూడా లీక్ అయింది. అందుకు సంబందించిన లిరిక్స్ కూడా ట్విట్లర్లో హల్చ్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు ఇదేనంటున్నారు. ఆర్సీ 15లో తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు చరణ్. దాంతో తండ్రి క్యారెక్టర్ పేరు అప్పన్న అని తెలుస్తోంది. ఇక కొడుకు పాత్ర పేరు రామ్ నందన్ అని అంటున్నారు. తండ్రి పొలిటికల్ లీడర్‌గా, సీఎంగా కనిపించనుండగా.. కొడుకు కలెక్టర్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇదే కాదు ఆర్సీ 15 గురించి ఎన్నో లీకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా లీకేజీ వీడియోలు మాత్రం.. ఆర్సీ 15కి భారీ హైప్ తీసుకొస్తున్నాయి.