Pilot Video: పైలట్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో అతను తన ఫ్లైట్ అటెండెంట్ తల్లి కోసం ప్రకటన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అందరి మనసులు దోచుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. దీనిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఆయన ప్రకటన చేయగానే ఫ్లైట్‌లో కూర్చున్నవాళ్లు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. తన తల్లితో కలిసి ఒకే విమానంలో ఉన్నందుకు పైలట్ ఎంత ఆనందంగా ఉన్నాడో వీడియోలో చూడొచ్చు.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానంలో తల్లి, కొడుకు ఇద్దరూ పని చేస్తున్నారు. ఈ వీడియోను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దాని క్యాప్షన్ ఇలా ఉంది, ‘మీ లంచ్ ప్యాక్ చేసే వ్యక్తి మీ సహోద్యోగిగా మారినప్పుడు.’ విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ ప్రకటన చేయడం వీడియోలో చూడవచ్చు. ముందుగా వాతావరణం గురించిన సమాచారం ఇచ్చి ఆ తర్వాత విమానంలో కూర్చున్న ప్రయాణికులకు స్వాగతం పలుకుతాడు.
దీని తర్వాత పైలట్ తన తల్లి కారణంగా ఈ విమానం తనకు చాలా ప్రత్యేకమైనదని, ఆమె ఫ్లైట్ అటెండెంట్ అని చెప్పాడు. వీడియో చివర్లో తన తల్లిని అందరి ముందు పరిచయం చేస్తాడు. ఈ వీడియోను కొన్ని రోజుల క్రితం ఎయిర్‌లైన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది ఇప్పటివరకు 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వీడియోపై జనాలు కూడా పలు రకాలుగా చాలా కామెంట్లు చేస్తున్నారు.