NLG: మర్రిగూడ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 1.50 కోట్ల రూపాయలతో పూర్తిచేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆదివారం జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఈ పనులను చేపట్టారు. ఛైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి, ఎమ్మెల్యేతో పాటు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా 225 పోస్టులను భర్తీ చేయనున్నారు. NOV-6తో ఆన్ లైన్ దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఈ పరీక్షను DECలో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
BDK:పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాల గురించి ఎస్సై రమాదేవిని డీఎస్పీ అబ్దుల్ రహమాన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం సుజాతనగర్ పోలీస్ స్టేషన్‌ను కొత్తగూడెం డీఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అలాగే పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. వారితో సీఐ వెంకటేశ్వర్లు, సీసీ బాబురావు ఉన్నారు.
PDPL: దీపావళి సందర్భంగా పటాకుల వినియోగం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు ప్రభుత్వం, టీజీపీసీబీ మార్గదర్శకాలను పాటించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే పటాకులు కాల్చాలని, పాఠశాలలు, ఆసుపత్రుల సమీపంలో వాడకూడదని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
NZB: బోధన్ మున్సిపల్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి శనివారం సందర్శించారు. ఆస్తి పన్ను తరహాలో 2017వ సంవత్సరం నుంచి పట్టణ ప్రజల కుళాయి కనెక్షన్లు సైతం ఆన్లైన్లో నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు సూచించారు. ఈ ప్రక్రియలో టెక్నికల్ సమస్యలు ఏర్పడితే సీడీఎంఏకు ఫిర్యాదు చేయాలన్నారు.
KMM: ఖమ్మం ఆర్టీసీ డిపోలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రీజియన్ ప్రచార కార్యదర్శి తోకల బాబు మాట్లాడుతూ.. సమస్యలను పరిశీలించి త్వరలో డిపో పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
KNR: చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు స్వాద్విన్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం పరామర్శించి, రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చూడాలని కోరారు. భవిష్యత్తులో బాలుడికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు
VKB; పరిగి మండలం పెద్దమాదారంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎల్కిచర్ల రమేశ్ ముందుకొచ్చారు. పరిగి SI మోహన్ కృష్ణను కలిసి రూ.1,01,000 విరాళంగా శనివారం అందజేశారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని SI అన్నారు.
SRPT: అమృత్ 2.0 పథకానికి కోదాడ ఎంపికైందన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ అధ్యక్షతన తొలి స్టేక్‌హోల్డర్ సమావేశం జరిగింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, విద్య వంటి రంగాలపై సమగ్ర ప్రణాళిక అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
TG: దండుపాళ్యం పాలన ఎవరిదో ప్రజలకు తెలుసని, అధికారం లేదనే అసహనంతో BRS నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకోవడానికే మైండ్‌గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులది ఒకటే అజెండా అని, గత 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.
HYD: దీపావళి పండుగ సందర్భంగా టపాసుల శబ్దాలకు భయపడిన ఓ పిల్లి సికింద్రాబాద్ పరిధిలో బావిలో పడింది. బయటకు రాలేకపోవటానికి గమనించిన స్థానికులు అనిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ బృందాలకు సమాచారం అందించారు. పిల్లిని రక్షించడం కోసం లోతైన బావిలోకి దిగి, పెద్ద సాహసమే చేశారు. పిల్లిని రక్షించడం పట్ల స్థానికులు హర్ష వ్యక్తం చేశారు.
SRCL: వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు జెవీవీ జిల్లా జనరల్ సెక్రటరి పారం లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడానికి గత 37 ఏళ్లుగా జనవిజ్ఞాన వేదిక అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుతూ స్వచ్ఛమైన గాలి కోసం కృషిచేయాలని సర్పంచ్ అడాలసూరిబాబు,సెక్రెటరీ ఎం సత్యనారాయణ విద్యార్థులకు వివరించి, హైస్కూల్లో మొక్కలు నాటారు.హెచ్ఎం రామరాజు,సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
BHNG: భువనగిరి MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో రాజ్ భవన్ ముట్టడి సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. త్వరలోనే తనపై ఉన్న ఈ కేసులను కోర్టు కొట్టివేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ELR: వంగాయిగూడెం మద్యం దుకాణం సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు పక్కనే పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు తెలపడంతో.. ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ ఇంఛార్జ్ ఎస్సై దుర్గాప్రసాద్ పరిశీలించి మద్యం మత్తులో రోడ్డుపై పడటంతో అతని తలకు గాయమై రక్తం కారిందని స్పష్టం చేశారు. అతనికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్య సహాయం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలియజేశారు.