AP: ఉద్యోగాలకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘గత ప్రభుత్వం మొత్తం రూ.7 వేల కోట్ల బకాయిలు ఉంచింది. సరెండర్ లీవ్‌కు రూ.830 కోట్ల బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు. తాము రాష్ట్ర అభివృద్దికే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు’ అంటూ వెల్లడించారు.
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపెల్లి – దేశముఖి రహదారిలో చిరుత పులి లాంటి అడుగుల ముద్రల ఆనవాళ్ళు కనిపించాయి. స్థానికులు చిరుత పులి అడుగుల లాంటి జడ కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. హైనా జంతువు అడుగులుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
MHBD: జిల్లా నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న 88 మంది సర్వేయర్లకు CM చేతుల మీదుగా రేపు నియామక ఉత్తర్వులు అందుకోనున్నట్లు జిల్లా ల్యాండ్ సర్వేయర్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహమూర్తి తెలిపారు. ఈ 88 మందిని ఇవాళ ప్రత్యేక బస్సుల్లో HYDలో జరిగే కార్యక్రమానికి తరలివస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు, ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియ ముగింపు సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. చివరి రోజు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరిలో APకి చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయడం విశేషం. ఈ దుకాణాల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ఈ నెల 23న డ్రా నిర్వహించనున్నారు.
AP: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించాం. నవంబర్‌లో రూ.105 కోట్లు చెల్లిస్తాం. జనవరిలో మరో రూ.105 కోట్లు ఇస్తాం. చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు’ అంటూ పేర్కొన్నారు.
TG: రాష్ట్రంలో ‘బీసీ బంద్’ విజయవంతమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్‌కు మద్దతు తెలిపాయన్నారు. బీసీ బంద్‌కు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ డిమాండ్‌పై న్యాయ వ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ADB: ఉట్నూర్ మండలం గొట్టిగోండగూడ గ్రామానికి చెందిన అనసూయకు శనివారం పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ అజ్మీరా ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని ఆస్పత్రికి చేర్చినట్లు పైలట్ రాజేందర్ తెలిపారు.
KNR: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB)లో 43 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీఈఓ సత్యనారాయణ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి నవంబర్ 6 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాత పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు, నిబంధనల కోసం అభ్యర్థులు బ్యాంకు వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.
HYD: అమృత్ భారత్ స్టేషన్స్ పథకంలో భాగంగా కొనసాగుతున్న వివిధ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులపై సికింద్రాబాద్ రైల్వే నిలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి సంబంధించి జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, DRN డాక్టర్ రామకృష్ణ తదితరులు వివరించారు. పునరాభివృద్ధి మరో ఏడాదిలో పూర్తికానుంది.
SKLM: సారవకోట మండలంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం పర్యటించారు. ఈ మేరకు నౌతల కూడలిలో చిన్నారులు చేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కేంద్ర మంత్రి దృష్టిని ఆకర్షించింది. వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా చిన్నారులు ర్యాలీ చేపట్టడం కేంద్ర మంత్రిని ఆలోచింపజేసింది. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్‌ను ఆపి చిన్నారులతో ముచ్చటించారు.
TG: మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందించిన రెండు యూట్యూబ్ ఛానెళ్లపై HYD సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ ఛానెళ్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. SMలో స్వేచ్ఛ ఉందని, ఏ తరహా కంటెంట్ అయినా చేస్తామంటే కుదరదని HYD సీపీ సజ్జనార్ హెచ్చరించారు. చట్ట ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
NLG: నల్గొండ బాలికల జూనియర్ కళాశాల NSS విద్యార్థులు, స్టాఫ్ నర్సింగభట్ల గ్రామానికి చేరుకొని హై స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించే శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చెన్నుగూడెం సర్పంచ్ శ్రీలత జంగయ్య యాదవ్ ప్రారంభించి, విద్యార్థులకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధారాణి, NSS అధికారులు పాల్గొన్నారు.
PDPL: ధర్మారం మండలంలో పెన్షన్ ఇప్పిస్తానంటూ వృద్ధురాలిని మోసం చేసి, 2 తులాల బంగారు గొలుసు దొంగిలించిన అల్లెపు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో ఇతనిపై 96 కేసులు ఉన్నాయని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. నవీన్ మెడికల్ ఏజెన్సీ వద్ద నిందితుడిని పట్టుకొని, బంగారు గొలుసుతో పాటు రూ.30 వేలు నగదును రికవరీ చేసినట్లు చెప్పారు.
KMR: పిట్లం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రస్తుత స్థితిని, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన ఇతరులను ఎంపిక చేయాలని ఆమె ఆదేశించారు.