• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పుతిన్ బతికే ఉన్నాడా’ జెలెన్ స్కీ హాట్ కామెంట్స్.. రష్యా కౌంటర్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హాట్ కామెంట్స్ చేశారు. తన ప్రత్యర్థి రష్యా అధ్యక్షుడు ఇంకా బతికే ఉన్నారా అని సందేహాం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌‌ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. టిపిన్ చేసే సమయంలో మాట్లాడుతూ.. పుతిన్‌ ఇంకా బతికే ఉన్నారా? లేదా? అన్నారు. పుతిన్ జీవించి ఉన్నారో లేదో తెలియడం లేదన్నారు. ‘పుతిన్ బతికే ఉన్నారా? లేదంటే మరి ప్రభుత్వ నిర్ణ...

January 21, 2023 / 11:22 AM IST

రాహుల్ గాంధీని శంకరాచార్యతో పోల్చిన ఫరూఖ్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అద్వైతాన్ని ప్రవచించిన ఆది శంకరాచార్యులతో పోల్చారు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌, జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా. కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి శంకరాచార్య అని గుర్తు చేశారు. ఆ తత్వవేత్త మాదిరి ఇప్పుడు రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. 19న జమ్మూ కాశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. భారత్‌ను ఏ...

January 21, 2023 / 02:15 PM IST

వందేభారత్ రైలుపై మరోసారి దాడి.. ఈసారి ఎక్కడంటే?

వందేభారత్ రైళ్లపై దాడులు కలకలం రేపుతోన్నాయి. పశ్చిమ బెంగాల్, విశాఖపట్టణంలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీహార్‌లో గల కతిహార్ జిల్లాలో ఈరోజు దాడి జరిగింది. 22302 నంబర్ రైలుపై దుండగులు రాళ్లతో దాడిచేశారు. సీ6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య గ...

January 21, 2023 / 10:16 AM IST

గూగుల్ ఉద్యోగులకు షాక్..12 వేల మంది తొలగింపు?

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంతో 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. గూగుల్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తూ క్రోమ్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, ఇతర వేద...

January 20, 2023 / 09:02 PM IST

240 రంగులు మార్చే బీఎండబ్ల్యూ కారు..వీడియో వైరల్

బీఎండబ్ల్యూలో సరికొత్త కారు అందుబాటులోకి రానుంది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఓ సరికొత్త మోడల్ ను ఆవిష్కరించింది. ఆయా పరిస్థితులను బట్టీ 240 రంగులను ఆ కారు మార్చనుంది. ఈ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. Dee comes full colour ?⚪️???Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to [&hell...

January 20, 2023 / 08:16 PM IST

గాంధీ భవన్ లో కలుసుకున్న ఆ ఇద్దరు.. చెవిలో గుసగుసలు.. మర్మమేంటో?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీతో అంటీ అట్టనట్టు ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌లోకి అడుగు  పెట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. కాగా.. అందరికీ షాక్ ఇస్తూ ఈరోజు గాంధీ భవన్ లో ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక...

January 20, 2023 / 07:44 PM IST

దారుణం : కాంగోలో పడవ ప్రమాదం.. 145మంది మృతి

కాంగోలో ఘోర  పడవ ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200మంది ప్రయాణికులున్న పడవ నీటిలో మునిగిపోయింది.  ఈ ఘటనలో దాదాపు 145 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 55మంది అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. లులోంగా నదిలో మోటారు బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటున్నారు అధికారులు. నిజానికి ఈ మధ్యనే కాంగోలో తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడి చాలా మ...

January 20, 2023 / 07:27 PM IST

జీవో నెం.1పై సుప్రీం కోర్టు నిర్ణయం సరైనదే : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ని హైకోర్టు సస్పెండ్ చేయగా.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీం కోర్టు దీనిపై స్పందించింది. ఈ జీవో విషయంలో తాము  జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పింది. సుప్రీం నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలతో ప్రజాధనాన్ని ...

January 20, 2023 / 07:21 PM IST

బీజేపీకి పురందేశ్వరి రాజీనామా..?

బీజేపీ సీనియర్ నేత పురుందేశ్వరి బీజేపీకి రాజీనామా చేశారా..? ఇది పుకారు కాదు… స్వయంగా… పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్లు చెప్పడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో.. తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు చెప్పారు. దానిలో భాగంగానే.. ఓ సందర్భంలో పురందేశ్వ...

January 20, 2023 / 07:10 PM IST

ఆస్కార్ బరిలో ఎన్టీఆర్‌దే టాప్‌ ప్లేస్‌!

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో మార్మోగుతున్న ఏకైక పేరు ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా.. వార్తల్లో నిలుస్తునే ఉంది. ఈసారి ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక నెక్స్ట్ ఆస్కార్ కొట్టేయడమే లేట్ అంటున్నాయి హాలీవుడ్ ప్రిడిక్షన్స్. అ...

January 20, 2023 / 07:00 PM IST

కశ్మీర్ కి రాగానే ఇంటికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర కశ్మీర్ కి చేరుకుంది. పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్ మీదుగా రాహుల్ గాంధీ జ‌మ్మూలోకి ప్ర‌వేశించారు. కాగా, జ‌మ్మూ కాశ్మీర్ స‌రిహ‌ద్దులో రాహుల్ గాంధీకి ఆ రాష్ట్ర‌నేత ఫ‌రూక్ అబ్ధుల్లా స్వాగ‌తం ప‌లికారు. ఈనెల 30 వ‌ర‌కు జ‌మ్మూకాశ్మీర్‌లో రాహుల్ గాంధీ పాద‌యాత్ర కొన‌సాగ‌నున్న‌ది. ఈనెల 30వ తేదీన శ్రీన‌గ‌ర్‌లో జ‌రిగే పాద‌యాత్ర‌, భారీ బ‌హిరంగ స‌భ‌తో భార‌త్ జోడో యాత్ర ముగుస్త...

January 20, 2023 / 06:38 PM IST

‘హరిహర వీరమల్లు’ టీజర్ టైం దగ్గర పడింది!

ఈసారి యూట్యూబ్ పగిలిపోవాల్సిందేనని.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పవర్ గ్లాన్స్ చూసి.. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మ...

January 20, 2023 / 06:30 PM IST

అక్రమ కట్టడాలపై ఉన్నత స్థాయి కమిటీ : మంత్రి తలసాని

హైదరాబాద్‌ లో అక్రమ కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని.  ఈ నెల 25న కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. నగరంలోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన స్పందించాయన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదని ఆయన తెలిపారు. పక్కన ఉన్న బస్తీకి మంట...

January 20, 2023 / 05:52 PM IST

viral:వావ్.. వాటే రోబో.. కన్ స్ట్రక్షన్ కంపెనీలో సాయం

ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి రోబో హెల్ప్ చేసింది. ఆ రోబో పేరు ‘అట్లాస్’. సాయం అంటే ఓ లేబర్ మాదిరిగా వర్క్ చేసింది. రోబోను బోస్టన్ డైనమిక్స్ రూపొందించారు. ఆ వీడియోను ఎంటర్ ప్రైజ్ క్లౌడ్ కంపెనీ బాక్స్ సీఈవో ఆరొన్ లెవి షేర్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రోబో చక్కగా ఆడుకుంటూ పనిచేస్తోంది. అదీ రోబోనేనా.. లేదంటే బక్క పలుచని మనిషా అనే సందేహాం కలుగుతుంది. ఒకతను [&hell...

January 20, 2023 / 05:47 PM IST

అయ్యన్నపాత్రుడి కుమారుడికి ఏపీ సీఐడీ నోటీసులు

టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ పోలీసులు మళ్లీ నోటిసులు పంపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆయన ఇంటికి వెళ్లి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు విజయ్ నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో తల్లికి నోటీసులు అందించారు. ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ‘భారతి పే’ పేరిట పోస...

January 20, 2023 / 05:35 PM IST