చికోటీ ప్రవీణ్..(Chikoti Praveen) అలియాస్ క్యాసినో ప్రవీణ్.. ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్ నడిచింది. ప్రపంచవ్యాప్తంగా కేసినోలు( Casino) నిర్వహించడం, వాటికి ప్రముఖులను ఆహ్వానించడం చేశాడు. క్యాసినోలు, అక్రమ మార్గాల్లో నగదు తరలింపు, మనీ లాండరింగ్ అభియోగాలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ (ED )పల మార్లు విచారించిన సంగతి తెలిసిందే.
భారత ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కొత్త వారికి (fresh recruiters) వార్షిక వేతనం రూ.6.5 లక్షలు ఆఫర్ చేసిన ఈ సాఫ్టువేర్ దిగ్గజం... ఆ తర్వాత దానిని దాదాపు సగానికి కోత విధించాలని నిర్ణయించుకుంది.
తాను విశాఖ లోకసభ స్థానం (vishaka lok sabha) నుండి తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని సీబీఐ (CBI) మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ (VV Lakshminarayana) మరోసారి స్పష్టం చేశారు.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్ బెస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఐసీసీ( ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ తహిలా మెక్‌గ్రాత్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది.
గన్నవరంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి, తదనంతర పరిణామాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి, పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం ఆరోపణలు ప్రతిపక్ష పార్టీకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పోలీసులు ఎట్టకేలకు పట్టాభిని మంగళవారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపించారు పట్టాభి.
భారత మార్కెట్లోకి 10 వేల రూపాయాల్లోపే అద్భుతమైన ఫోన్ అందుబాటులోకి వచ్చింది. POCO C55 స్మార్ట్‌ఫోన్ రూ. 9,499 వద్ద ప్రారంభమైంది. 50MP డ్యూయల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, MediaTek Helio G85 చిప్‌సెట్ వంటి మంచి ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది.
ప్రధాన మంత్రి బేరోజ్‌గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అలాంటి వార్తలను గుడ్డిగా నమ్మి ఇతరులకు షేర్ చేయకూ...
జార్ఖండ్ రాంచీ జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగుల దాడులతో మూడు రోజుల్లో 10 మంది మరణించారు. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అక్కడి అధికారులు సూచించారు.
దేశంలో ఇటీవల ప్రారంభమైన వందేభారత్ రైళ్లకు క్రమంగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రారంభం కాగా...60 మంది ఎంపీలు తమ నియోజకవర్గాలకు కూడా ఈ ట్రైన్స్ కావాలని రైల్వే శాఖకు లేఖలు రాశారు. కోరిన వారిలో బీజేపీకి చెందిన వారు ఎక్కువగా ఉండగా, విపక్ష ఎంపీలు 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
పఠాన్ మూవీలో ఓ పాఠకు డాన్స్ చేసిన మహిళా ప్రొఫెసర్ల వైరల్ డాన్స్ వీడియోను చూసిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చూసి రియాక్ట్ అయ్యారు. అలాంటి ఉపాధ్యాయులు, ఫ్రొఫెసర్లు దొరకడం అదృష్టమని ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను జత చేస్తూ వెల్లడించారు.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారులు గొడవకు దిగిన అంశంపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇద్దరు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. కానీ ప్రస్తుతం వీరికి ఏ శాఖలో కూడా పోస్టును కేటాయించలేదు.
Bonda Uma : రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శల వర్షం కురిపించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. జగన్ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు.
Student sets principal on fire:మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. బీఎం కాలేజీ ప్రిన్సిపల్‌పై (principal) విద్యార్థి (student) నిప్పు అంటించారు. తన మార్కుల సీట్ (marks sheet) ఇవ్వడం ఆలస్యం చేస్తున్నారని ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తెలంగాణలో రానున్న రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగంలో 8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇదే విభాగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల మంది ఉద్యోగాలను 2028 నాటికి రెట్టింపు చేస్తామని వెల్లడించారు.
coconut water and lemon juice:కొబ్బరి బొండంలో (coconut) నిమ్మరసం (lemon juice) కలిపి తాగితే మంచిదే. డీ హైడ్రేషన్ తొందరగా ఎదుర్కొవచ్చు. వెంటనే శక్తిని అందజేస్తోంది. స్కిన్ (skin) హెల్దీగా ఉండేందుకు సాయం చేస్తోంది. కొబ్బరి బొండం, నిమ్మ రసం కలిపి తీసుకుంటే విటవిన్లు, ఖనిజాలు పుష్కలం.. ఎలక్ట్రోలైట్లను ఇస్తోంది.