పద్మ అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా రంగాల్లో పురస్కారాలు పొందిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి పద్మభూషణ్ చినజీయర్ స్వామి పొందారు. ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు స్వీకరించాడు.
సీపీఆర్ తో 23 రోజుల పసిపాపకు పునర్జన్మ దక్కడం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిదర్శనంగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. సీపీఆర్ తో పాపను కాపాడిన వీడియో వైరల్ గా మారింది.
రామోజీ రావు కి నాగబాబు మద్దతు తెలపడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయనకు ప్రజారాజ్యం జెండా పీకేద్దాం అన్నప్పుడు మీరేం చేశారంటూ గుర్తు చేస్తున్నారు.
బండి సంజయ్ కు హన్మకొండ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రెండు వారాల రిమాండ్ విధించారు. ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రాకుంటే ఖమ్మం జైలుకు తరలించవచ్చు.
హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బలంగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో వర్ష ప్రభావం ఉంది.
పదో తరగతి హిందీ పేపర్ లీక్‌కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ టీవీ డిబెట్‌లో మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు కూడా కొశ్చన్ పేపర్ వచ్చిందని అడగగా.. తనకు మొబైల్‌లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని తెలిపారు.