• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఫ్లై ఓవర్ బ్లాక్ చేయడంతో ఫ్లైట్ మిస్సయ్యింది: శ్రీరామచంద్ర

టాలీవుడ్ సింగర్ శ్రీ రామ చంద్ర హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేతల కోసం ఫ్లై ఓవర్ బ్లాక్ చేయడం ఏంటీ అని ట్వీట్ చేశారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఓ రాజకీయ నేత కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారని తెలిపారు. జనం ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్లాల్సి వచ్చిందట. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెహికిల్స్ రద్దీతో ప్రయాణం అరగంట […]

January 31, 2023 / 03:25 PM IST

లోకసభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

నిర్మలా సీతారామన్ మంగళవారం లోకసభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను ఆమె ప్రవేశపెట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన అనంతరం నిర్మలమ్మ ఈ సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేసారు. కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ముందు రోజు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంటు ఉభయసభల ఎదుట ప్రవేశపెట్టడం ఆనవాయితీ....

January 31, 2023 / 02:52 PM IST

సిలిండర్ ఇంటికి తెస్తే ఆ ఛార్జీలు చెల్లించొద్దు: ఏపీ సర్కార్

గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో అనేక దోపిడీలు జరుగుతున్నాయి. ఈ దోపిడీలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ డీలర్లు వినియోగదారుల్ని డెలివరీ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. ఈనేపథ్యంలో ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఓ ప్రకటన చేశారు. తాజా నిబంధనల ప్రకారంగా గ్యాస్ ఏజెన్సీ నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తే...

January 31, 2023 / 01:31 PM IST

శ్రీవారి సేవలో సీని నటి కాజల్ అగర్వాల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా పేరొందిన కాజల్ అగర్వాల్ లక్ష్మికళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.పెళ్లి తరవాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా సీని నటి కాజల్  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కొడుకుతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలన...

January 31, 2023 / 01:20 PM IST

సింగరేణిలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే మీకే జాబ్

భారతదేశంలోనే అత్యధిక లాభాలతో కొనసాగుతూ.. సిరులు కురిపిస్తున్న సంస్థ సింగరేణి. ఈ సంస్థలో ఉద్యోగమంటే ఉత్తర తెలంగాణ ప్రాంత యువతకు ఓ కలలాంటిది. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయాలని ఎప్పటి నుంచో నిరుద్యోగులు కలలు కంటున్నారు. అలాంటి వారికోసం సింగరేణి మరో ప్రకటన విడుదల చేయనుంది. సింగరేణి సంస్థలో 558 ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని సింగరేణి సంస్థ ప్రకటించింది. ...

January 31, 2023 / 01:25 PM IST

ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3వ తేదిన నుంచి శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పిబ్రవరి 3వ తేదీ శుక్రవారం రోజున సమావేశాలను ప్రారంభించనున్నట్లుగా స్టేట్ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యలు ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 6న బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టే అవ‌కాశం కనిపిస్తోంది. అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల‌పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు ఇప్పటికే స‌మాచారం అందించారు. ...

January 31, 2023 / 12:47 PM IST

ఐసీయూలో తారకరత్న ఫోటో లీక్

హీరో నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకరత్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. కార్యకర్తలు ఆయన్ని కుప్పం హాస్పిటల్ కు తరలించగా హార్ట్ ఎటాక్ అని తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ అందించాక మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్...

January 31, 2023 / 12:45 PM IST

ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే అద్భుతం : ఆనంద్ మహీంద్రా

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే వేగంగా దూసుకుపోయే జాతీయ రహదారి గురించి ఆయన ప్రస్తావన చేశారు. దీన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదిగా పేర్కొన్నారు. ఎంతో బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా.. సమాజానికి కూడా కొంత సమయం కేటాయిస్తుంటారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు విషయాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో మందిని ఆలోచింపజేయడం, ప్రోత్సహించడం చేస్తుంటారు‘‘ ఇది భారత దేశ ఆర్థిక...

January 31, 2023 / 12:15 PM IST

టాప్-10 ధనవంతుల లిస్ట్ నుంచి అదానీ ఔట్

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితా నుంచి చోటును కోల్పోయారు. వ్యాపార దిగ్గజం అయిన అదానీ ప్రముఖ వ్యాపారవేత్త అంబానీతో పోటీపడుతున్నారు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అదానీ అధినేతగా ఉన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్తు తయారీ, రవాణా, ఓడరేవుల నిర్వహణ వంటి వ్యాపారాలో అధానీ దూసుకుపోతున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ 10లో అదానీ కొనసాగుతున్నారు. అయ...

January 31, 2023 / 12:14 PM IST

ఆత్మవిశ్వాసంతో భారత్.. వచ్చే 25 ఏళ్లు కీలకం: రాష్ట్రపతి

దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని అభిప్రాయ పడ్డారు. ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించుకుందామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం ఇలా కొనసాగింది.. ‘అ...

January 31, 2023 / 12:02 PM IST

బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మోడీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం బడ్జెట్ వైపు చూస్తోందన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం మన రాజ్యాంగానికి, ప్రత్యేకించి మహిళల గౌరవానికి గర్వకారణమన్నారు. ఐఎంఎఫ్ ఆర్థిక అంచనాల గురించి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రజా సమస్యలను తగ్గించి సరైన పాలన అందించే దిశగా బడ్జెట్ ...

January 31, 2023 / 11:50 AM IST

తొలిసారి తన కూతురు ఫొటోల్ని షేర్​ చేసిన ప్రియాంక చోప్రా

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురు ఫేస్ రివీల్ చేసింది. బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి తన టాలెంట్ తో హాలీవుడ్ వరకు ఎదిగింది. ప్రస్తుతం హాలీవుడ్ లోనే ఉంటూ అక్కడే వరుస సినిమాలు చేస్తుంది. ఇక ప్రొఫెషనల్ కెరీర్ నే కాదు పర్సనల్ కెరీర్ లో కూడా హాలీవుడ్ వ్యక్తినే భాగ్యస్వామిగా చేసుకుంది ప్రియాంక. అమెరికన్ సింగర్ మరియు నటుడు నిక్ జోనస్ ని ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిస...

January 31, 2023 / 11:32 AM IST

పెళ్లి కాకున్నా పిల్లలు కనొచ్చు.. ఎక్కడో తెలుసా..?

ప్రపంచంలో జనాభా విస్ఫోటనం భారీగా ఉంది. కానీ చైనాలో మాత్రం అతి తక్కువగా ఉంది. చైనాలో అమలు చేసిన విధానాలతో ఆ దేశంలో జనాభా పెరుగుదల భారీగా తగ్గింది. త్వరలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం హోదాను చైనా కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ స్థానంలో భారతదేశం నిలువనుంది. అయితే జనాభా తగ్గుదలపై డ్రాగన్ దేశం ఆందోళన చెందుతోంది. మరణాలతో పోలిస్తే జననాలు స్వల్పంగా ఉండడంతో నివారణ చర్యలు చేపట్టింది. దీనికోసం దేశంలో అమలు చేస్తు...

January 31, 2023 / 11:15 AM IST

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి వున్నారు. స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే రూ.300ల టికెట్ గల భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారు...

January 31, 2023 / 11:02 AM IST

ఎమ్మెల్యే రాజాసింగ్‎కు మరోసారి పోలీసుల నోటీసులు

మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ నోటీసులు ఇవ్వటమేంటీ అని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ధర్మం కోసం పనిచేయటమే నా లక్ష్యం అని దాని కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోను అంటూ తనదైన శైలిలో రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒకవర్గం మనోభావాలను కించపర్చే విధంగా వీడియో పోస్టు చేసినందుకు ఆయనపై పీడీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చ...

January 31, 2023 / 10:39 AM IST