రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. ఆ క్రమంలో ఓ బస్సును మరొకటి ఓవర్ టేక్ చేసే సమయంలో రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి(accident). దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.
సినీయర్ కాంగ్రెస్ నేత కుమారుడు తన భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్‌మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సూపర్‌స్టార్ రజినీకాంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad owner) యజమాని కావ్య మారన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో తన జట్టు ఓడిపోవడాన్ని చూసి ఆమె భావోద్వేగాలను చూడలేకపోయానని పేర్కొన్నారు.
స్టార్ హీరో పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej), కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన తెలుగు చిత్రం బ్రో(BRO) నిన్న(జులై 28)న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్షన్స్ సాధించిందో ఇప్పుడు చుద్దాం.
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాంత మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది చూసిన రానా, దుల్కర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలను అధికారులు శుక్రవారం రాత్రి జారీ చేశారు. గోదావరి వరద నీటిమట్టం 53 అడుగులకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతోపాటు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి నది ప్రవహిస్తున్న నేపథ్య...
పట్టపగలు ఓ యువకుడు(28) తనతో పెళ్లికి ఒప్పుకొలేదని ఓ యువతిని(25) రాడ్ తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర 2(Bharat Jodo Yatra 2)ను నిర్వహించేందుకు కాంగ్రెస్(congress) నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పాదయాత్ర సెప్టెంబర్ మాసంలో మొదలు కానున్నట్లు తెలిసింది.
ఓ బాలీవుడ్ హీరోయిన్ గురించి ఒక రివ్యూవర్ 5 కేజీలు పెరిగావని కామెంట్ చేశారని, అందుకు ఆమె బాధపడినట్లు పేర్కొన్నారు. అయితే సినిమాను బట్టి బరువు పెరగడం, తగ్గడం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.