• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Viral News: బాయ్‌ఫ్రెండ్ లేడని ఏడ్చిన యువతి

ఎక్కువగా అబ్బాయిలు తమకు ప్రేమించడానికి సరైన అమ్మాయి దొరకడం లేదని ఆవేదన చెందిన సంఘటనలు విన్నాం. కానీ అమ్మాయిలు ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ లేడని ఏడ్చిన సంఘటనలు విన్నారా? లేదా అయితే ఇక్కడ మాత్రం అదే జరిగింది. ఈ సంఘటన చైనా షాంఘైలో జరిగింది.

February 18, 2023 / 07:48 PM IST

Bandi Sanjay: కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టిండు

కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.

February 18, 2023 / 07:04 PM IST

Metro MD NVS Reddy: శంషాబాద్ కు మెట్రో చాలా కష్టమైన పనే

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మాణం క్లిష్టమైన సమస్యగా మారిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు. మెట్రోలైన్ నిర్మించే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు చేపట్టనున్న ఇంజినీరింగ్ వర్క్ ఇబ్బందిగా మారుతుందన్నారు. సుమారు 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం కష్టతరమని అంటున్నారు. ఆ క్రమంలో ఫ్లై ఓవర్, అండర్ పాస్, మధ్యలో రోటరీ వంటివి అడ్డుగా ఉన్నాయని వెల్లడించారు.

February 18, 2023 / 05:53 PM IST

Ola: భారత్‌లో రూ.7,614 కోట్ల ఓలా పెట్టుబడులు

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు ప్రభుత్వం మధ్య శనివారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, ఓలా సిఇఒ భవిష్ అగర్వాల్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం తమిళనాడులో 920 మిలియన్ డాలర్లు (రూ. 7,614 కోట్లు) ఓలా పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

February 18, 2023 / 04:56 PM IST

VBVK Movie Review: వినరో భాగ్యము విష్ణు కథ మూవీ రివ్యూ

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఫ్లాప్ చిత్రాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ ఈరోజు(ఫిబ్రవరి 18న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ మూవీ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

February 18, 2023 / 08:28 PM IST

Chandhra Babu Naidu : చంద్రబాబుపై పోలీసు కేసు..!

Chandhra Babu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. చంద్రబాబుతో సహా 8 మంది నాయకులు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎస్పీ భక్తవత్సలం వీరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

February 18, 2023 / 04:02 PM IST

Viral Video: మెగాస్టార్ పాటకు పీవీ సింధు స్టెప్పులు

మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఇస్ ది పార్టీ పాటకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన దైన స్టైల్లో స్టెప్పులు వేసిన ఈ వీడియోను సింధు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.

February 18, 2023 / 03:03 PM IST

kotamreddy sridhar reddy:తగ్గేదేలే..! షాడో సీఎంగా సజ్జల: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

kotamreddy sridhar reddy:ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (sajjala ramakrishna reddy) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy) ఫైరయ్యారు. తన అనుచరులను అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు (case) పెట్టినా భయపడేదే లేదని చెప్పారు.

February 18, 2023 / 03:02 PM IST

Accident: ఆగిన బైక్ లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..ముగ్గురు డెడ్

ఏపీలోని నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ద్విచక్రవాహనాలపైకి ఏపీఎస్ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

February 18, 2023 / 02:18 PM IST

weather : శ్రీకాకుళంలో అకాల వర్షం.. ఆందోళనలో అన్నదాత

శ్రీకాకుళంలో (Srikakulam) అకాల వర్షం (rain) దంచికొట్టింది.ఉదయం నుంచి.. ఒక్కసారిగా వాతావరణం ( weather) మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా మబ్బులు అలుముకున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తారు వర్షం పడింది.

February 18, 2023 / 02:01 PM IST

Cheetah నాడు 8.. నేడు మరో 12.. చీతాల అడ్డాగా భారతదేశం

పర్యావరణాన్ని సమతుల్యం చేసే లక్ష్యంతో గతంలో ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కాకపోతే ఈ ప్రక్రియ అనేక కారణాలతో ఆగిపోయింది. 71 ఏళ్ల తర్వాత నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధతో చీతాలను భారతదేశానికి రప్పించారు.

February 18, 2023 / 01:54 PM IST

Youtube Channelsపై నటుడు నరేశ్ ఆగ్రహం.. నా పరువు పోతోంది

పని గట్టుకుని తప్పుడు ప్రచారాలు, అసభ్యకర కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించాడు. యూట్యూబ్ చానల్స్ వాళ్లు ఇష్టారీతిన తన సొంత విషయాలపై కథనాలు ప్రసారాలు చేస్తున్నారని వాపోయాడు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఏకంగా పోలీసులను (Telangana Police) ఆశ్రయించాడు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, యూట్యూబ్ చానల్ నిర్వాకులను వదిలిపెట్టవద్దని స్పష్టం చేశాడు.

February 18, 2023 / 01:54 PM IST

అవార్డు ఫంక్షన్ లో కుప్పకూలిన Mirzapur నటుడు.. అంతలోనే

ఓ అవార్డు వేడుకలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అల్లాడుతూ అందరూ చూస్తుండగానే ఆయన తుది శ్వాస విడిచాడు. దీంతో ఆ అవార్డు వేడుక విషాదంగా ముగిసింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు సీపీఆర్ పద్ధతిలో బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు.

February 18, 2023 / 01:09 PM IST

Chandhra Babu Naidu : కుటుంబం మొత్తం ఏపీలోనే ఉండండి… చంద్రబాబుకి కార్యకర్త విన్నపం…!

Chandhra Babu Naidu : ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు పలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ పేరిట ఆయన ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

February 18, 2023 / 01:06 PM IST

pawar Advice To Uddhav:ఈసీ డిసిషన్ ఫైనల్.. సుప్రీంకు వెళ్లొద్దు:ఉద్దవ్‌కు పవార్ హితబోధ

pawar Advice To Uddhav:ఉద్దవ్ థాకరేకు (Uddhav Thackeray) ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి ఉద్దవ్ థాకరే (Uddhav Thackeray) సుప్రీంకోర్టులో (supreme court) సవాల్ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఒక్కసారి ప్రకటించిన తర్వాత ఇక దానిపై చర్చ అనవసరం అని శరద్ పవార్ సూచించారు.

February 18, 2023 / 01:37 PM IST