ఏపీలోని నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ద్విచక్రవాహనాలపైకి ఏపీఎస్ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వేగంగా వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ(apsrtc) బస్సు(bus) ఆగి ఉన్న రెండు బైక్ లను ఢీ కొట్టింది. ఆ క్రమంలో అక్కడే ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రి(hospital)కి తరలించే క్రమంలో ఇద్దరు మృతి చెందగా, ప్రమాదం(accident) జరిగిన ప్రదేశంలో ఓ వ్యక్తి మరణించాడు. మొత్తం ముగ్గురు మృత్యువాత చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది. ఈ ఘటన ఏపీ ఏలూరు జిల్లా(eluru district)లోని భీమడోలు మండలం పూళ్లు వద్ద చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సు(apsrtc bus) అతి వేగమే (speed) ఈ ప్రమాదానికి కారణమా? ఇంకా డ్రైవర్(driver) మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడా, లేదా ఆగిన ద్విచక్రవాహనాలు రోడ్డుకు దగ్గరగా పెట్టారా అనే కోణాల్లో పోలీసులు(police) వివరాలు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా మహాశివరాత్రి(mahashivratri) పండుగ రోజు బాధిత మృతుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. దీంతో వారు తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అద్దంకి-నార్కట్ పల్లి జాతీయ రాహదారిపై కూడా మరో యాక్సిడెంట్(accident) జరిగింది. స్పీడుగా వచ్చిన కారు(car) ఓ యువకుడిని(28) ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.