Chandhra Babu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. చంద్రబాబుతో సహా 8 మంది నాయకులు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎస్పీ భక్తవత్సలం వీరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. చంద్రబాబుతో సహా 8 మంది నాయకులు, వెయ్యి మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. డీఎస్పీ భక్తవత్సలం వీరిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించి, పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించడంపై డీఎస్పీ ఫిర్యాదు చేశారని అంటున్నారు. ఒక రకంగా నిన్నబలభద్రపురం నుంచి అనపర్తి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేసుకుంటూ వెళ్లడం మీద పోలీసులు అనేక చోట్ల కేసులు నమోదు చేశారు. హింసను ప్రోత్సహించారని.. పోలీసులపై తిరగబడ్డారంటూ కేసులు నమోదు చేస్తున్నట్టు చెబుతున్నారు.
చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలకు అనుమతిలేకున్నా నిర్వహించటంపైన కేసులు నమోదు అవగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బహిరంగ సభలకు పోలీసులు ముందు అనుమతి ఇచ్చి ఆ తరువాత నిరాకరించారని చెబుతున్నారు. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకోవడంతో బలభద్రపురం నుంచి అనపర్తి వరకు ఏడు కిలోమీటర్ల మేర చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లగా మధ్యలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీలు చేశారని టీడీపీ చెబుతోంది. అనేక అడ్డంకులను దాటుకుని అనపర్తి దేవిచౌక్లో చంద్రబాబు భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీంతో ఈ అంశం మీద అనపర్తిలో రెండు, బిక్కవోలులో ఒక కేసును పోలీసులు నమోదు చేశారు.