SKLM: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం రాత్రి జలుమూరు మండలం నారాయణ వలస సంత నుంచి ఆలమండకు అక్రమంగా రవాణా అవుతున్న 14 పశువులతో వెళుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రమంలో పశువులను టెక్కలి లోని భవానీపురం గోశాలకు తరలించామని పేర్కొన్నారు.
HYD: మనిషిని సృష్టించిన భగవంతుడికి ఆ మనిషికి ఏది ఎంత ఇవ్వాలో తెలుసునని ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి పేర్కొన్నారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసరంజని హైదరాబాద్ ఆధ్వర్యంలో రాత్రి రవీంద్రభారతి ప్రధాన మందిరంలో రచన ఎం. దివాకరబాబు, దర్శకత్వం డా. వెంకట్ గోవాడ, ప్రధాన పాత్రలు పలువురు నటించిన భూతకాలం నాటకం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.
TG: మాజీమంత్రి కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఈడీ నోటీసులిచ్చింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిలకు కూడా జనవరి 2, 3వ తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.
KNR: ఈరోజు సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈమేరకు బోయినపల్లి అంబేడ్కర్ చౌరసణాలో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ శ్రీధర్, తదితరులు ఉన్నారు.
బాక్సింగ్ డే టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సూపర్ ఫిఫ్టీ(54*) సాధించాడు. 6 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. నితీష్ గత మ్యాచుల్లో 40 ప్లస్ పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఎట్టకేలకు ఇవాళ టెస్టుల్లో తన మొదటి హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 274/7.
CTR: కుప్పం మండలం గుత్తార్లపల్లె సబ్ స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రెస్కో ఎండీ సోమశేఖర్ తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో శనివారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
NLR: పలు మున్సిపల్ కార్పొరేషన్లలో సర్వీస్ ప్రొవైడర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెప్మా పీడీ రాధా తెలిపారు. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, బుచ్చి, కందుకూరు కార్పొరేషన్ల పరిధిలో పలు కేటగిరీలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు, మరిన్ని వివరాలకు 7901311585 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
CTR: కూటమి ప్రభుత్వం హయాంలో వచ్చే రోజుల్లో చిత్తూరు అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరులో చదివే యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సావిత్రమ్మ కళాశాలలో శుక్రవారం సాయంత్రం క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపికైన యువతకు ఆయన నియామక పత్రాలు పంపిణీ చేశారు.
ATP: ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయని, దీంతో రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని టీడీపీ మండల కార్యదర్శి గోవిందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు 16మందిపై కేసు నమోదైంది.
KRNL: జిల్లా సర్వజన వైద్యశాలలో ఓ మహిళకు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఈ వివరాలను యూరాలజీ హెచ్ఐవోడీ, డిప్యూటీ సూపరింటెండెంటు డా.సీతారామయ్య శుక్రవారం వెల్లడించారు. కడపకు చెందిన రమణమ్మ (49) గత 6 నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ కడప సర్వజన వైద్యశాలలో సీటీ స్కానింగ్ చేయించుకున్నారు.
నల్గొండ: మంత్రి దనసరి అనసూర్య (సీతక్క)ని శుక్రవారం ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇంజ నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలేరు నియోజకవర్గానికి ప్రభుత్వవీప్ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని సీతక్కకు వివరించారు. అలాగే అధిక నిధులు ఆలేరు నియోజకవర్గానికి కేటాయించాలని విన్నవించారు.
KRNL: ఎమ్మిగనూరు మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైకాపా ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కింద చేపట్టిన పనులకు మోక్షం కలగడం లేదు. కూటమి ప్రభుత్వం రావడంతో నిధులు విడుదల చేసి పూర్తి చేస్తారన్న ఆశతో ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ రూ.2.80 కోట్లతో 20 అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. ముందుగా రూ.కోటి నిధులను విడుదల చేశారు.
NDL: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం MPDO జవహర్ బాబుపై దాడి ఘటనను ఆ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో దాడులకు తావు లేదని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ఆదేశాలీచ్చారు.
శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధి డిసిసిబి కాలనీ భవానీ నగర్ కాలనీలోని మురికినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బ్యాంకర్స్ కాలనీ టిడిపి నాయకులు యాపార శ్రీనివాసరావు అన్నారు. స్థానికులు ఫిర్యాదు మేరకు భవానీ నగర్ కాలనీ మురికినీటి ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. సమస్య ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం చేపడతాన్నారు.
MNCL: పాత కక్షలతో ఒకరిని హత్యకు ప్రయత్నించిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రూరల్ CI అన్జలుద్దీన్ వివరాల ప్రకారం.. శివసాయి, జాడి శ్యామ్ రావులకు గతంలో పురుషోత్తం అనే వ్యక్తితో విబేధాలు ఉన్నాయి. దీంతో అతణ్ని హత్య చేయడానికి ముగ్గురుకి రూ.50వేలు సుపారి ఇచ్చాడు. ఈనెల 24న పురుషోత్తం కారులో వెళుతుండగా అతని కారు ఆపి బండరాళ్లతో తలమీద బాది పారిపోయారు.