నల్గొండ: చిట్యాల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం జరిపే టోకెన్ సమ్మె సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేస్తూ కనక దుర్గ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలన్నారు.
VZM: కృష్ణా జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం జక్కువ గ్రామానికి చెందిన కొంతెన రాములు(55) దుర్మరణం పాలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. బహిర్భూమికి వెళ్తుండగా కూరగాయల లోడుతో వెళ్తున్న వాహనం వారిని ఢీకొంది. ప్రమాదం విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
KMM: జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు యాసంగిలో కళకళలాడనుంది. ఓవైపు జలాశయాల్లో పుష్కలంగా ఉన్న నీటికి తోడు సాగర్ జలాలు సైతం విడుదల చేస్తుండటంతో పంటల సాగుకు డోకా లేనట్లేనని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ అందుతుండటంతో రైతాంగం వరికే ప్రాధాన్యత ఇస్తోంది. ఆయకట్టుకు 34టీఎంసీల నీటిని కేటాయించగా ఈనెల 15 నుంచే విడుదలవుతున్నాయి.
KRNL: ఆలూరు నుంచి కర్నూలు వెళ్లే రహదారిపై రూ.16 లక్షలతో గుంతలు పూడ్చే పనులు రెండు నెలల కిందట ప్రారంభించారు. కంకర వేసిన తర్వాత పనులు చేయకుండా వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంకర వేసి దానిపై తారు పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈనాడు, కర్నూలు, ఆలూరు, గడివేముల, ఆదోని ఎస్కేడి దూకులు మారలేడు.
KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు తల్లాడ మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జి ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. కావున సంబంధిత అధికారులు మీడియా మిత్రులు గమనించి మంత్రి పర్యటన విజయవంతం చేయాలన్నారు.
VZM: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సాలూరు జూనియర్ కోర్టు సివిల్ న్యాయాధికారి కె. రమేష్ అన్నారు. శుక్రవారం మక్కువ వెలుగు మహిళా సమాఖ్య భవనంలో మహిళా సంఘ సభ్యులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గృహ హింస చట్టాలపై, మహిళల లైంగిక వేధింపులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
VZM: నెల్లిమర్ల, రామతీర్థం దేవస్థానంలో భక్తుల నిత్యాన్నదానానికి కంచాలు, గ్లాసులు వితరణగా గ్రామానికి చెందిన ఖండవల్లి రామకృష్ణాచార్యుల పేరు మీద వారి కుమారులు కిశోర్ కుమార్, కిరణ్ కుమార్ దంపతులు అందజేశారు. వీరితో పాటు దాసరి శ్రీనివాస్ దంపతులు కలిసి 100 స్టీల్ కంచాలు, 100 గ్లాసులను ఈవో వై. శ్రీనివాసరావుకు అందజేశారు.
NDL: అటవీ సంపదను సంరక్షించుకుంటూ వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ జి. రాజకుమారి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పచ్చర్ల ఎకో టూరిజమ్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో కలిసి జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై పోస్టర్లను ఆవిష్కరించారు.
కడప: సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అప్పుల బాధలు భరించలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతు K.నాగేంద్ర(35) తన భార్య వాణి(35), పిల్లలు భార్గవ్ (16), గాయత్రి (14) ముగ్గురికి ఉరివేసి చంపి తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MBNR: ఉమ్మడి జిల్లాలోని మోడల్ స్కూళ్లల్లో 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని SC, ST, BC, దివ్యాంగులు, EWS విద్యార్థులు రూ. 125, ఓసీలు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి తెలిపారు. ఒంగోలులోని ఎన్‌జీఓ హోం సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. సమావేశానికి పెన్షనర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్లు హాజరుకావాలని కోరారు.
VZM: కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయనగరం జిల్లాలో నిన్న వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. బొత్స సత్యనారాయణ నియోజకవర్గమైన చీపురుపల్లిలో సైతం భారీ ర్యాలీ జరిగింది. నిన్న విజయనగరం జిల్లాలోనే బొత్స ఉన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా, వైసీపీలో ఉన్న ఆయన ఆందోళనల్లో పాల్గొనలేదనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ATP: గార్లదిన్నె మండలంలోని కేశవాపురానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు యువతి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 26న రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని, బంధువుల గ్రామాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గౌస్ బాషా తెలిపారు.