• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తా: ఎమ్మెల్యే

NGKL: ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామంలోని కేఎస్ఐ కాల్వ భూములు కోల్పోయిన రైతులు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణని శుక్రవారం కలిశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అధికారులతో, కలెక్టర్‌తో మాట్లాడి భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే విధంగా త్వరలో నిధులు విడుదల అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు.

December 28, 2024 / 08:50 AM IST

బొల్లికొండ రంగనాథస్వామికి ధనుర్మాస పూజలు

ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి ఆలయంలో శనివారం ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి ఆలయ అర్చకులు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

December 28, 2024 / 08:45 AM IST

వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఆహ్వానం

విశాఖపట్నంలోని వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వర రావు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం cfw.ap.nic.in వెబ్సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

December 28, 2024 / 08:42 AM IST

బుచ్చిలో రోడ్డు ప్రమాదం

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి సంగం వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ, జొన్నవాడ వైపు నుంచి పాల క్యాన్లతో బుచ్చి వైపు వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారణ చేపట్టారు.

December 28, 2024 / 08:42 AM IST

రియల్‌లైఫ్‌ స్టోరీతో ధనుష్‌ సినిమా!

ధనుష్‌ డైరీలో ఓ కొత్త సినిమా వచ్చి చేరింది. ఇది కూడా బయోపిక్కేనని సమాచారం. ‘అమరన్‌’ దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని టాక్. నిజానికి రాజ్‌కుమార్‌ ఓ బాలీవుడ్‌ సినిమాను ఇటీవలే ప్రకటించాడు. అయితే.. ఆ సినిమాకంటే ముందే ధనుష్‌తో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

December 28, 2024 / 08:39 AM IST

నేడు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

VSP: గంగవరం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో పి.జి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో మూడు ప్రముఖ ప్రైవేటు కంపెనీలు పాల్గొంటుని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని అన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీయువకులు పాల్గొనాలని కోరారు.

December 28, 2024 / 08:36 AM IST

గుడిలోకి దూసుకెళ్లిన కంటైనర్

TPT: వరదయ్యపాలెంలో శుక్రవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఓ కంటైనర్ అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆలయంలో ముగ్గులు వేస్తున్న గీత(40) స్వల్పగాయాలతో బయటపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 28, 2024 / 08:35 AM IST

ఉర్దూ కళాశాలను సందర్శించిన కూటమి నాయకులు

ATP: గుంతకల్లు పట్టణంలో టీడీపీ హయాంలో నిర్మించిన ఉర్దూ అరబిక్ కళాశాలను శనివారం గుంతకల్లు టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి స్థానిక టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి పరిశీలించారు. కళాశాలను మరమ్మతులు చేసి త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని గుమ్మనూరు నారాయణస్వామి తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

December 28, 2024 / 08:34 AM IST

నేటి నుంచి సదరన్ ఇండియన్ సైన్స్ ఫెయిర్

NLR: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో నేటి నుంచి సదరన్ ఇండియన్ సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8, 9,10 తరగతి విద్యార్థులు మూడు గ్రూపులుగా విడిపోయి ప్రాజెక్టులు తయారు చేసి ఒక గ్రూపును మండల స్థాయికి ఎంపిక చేసి 30న జరిగే జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయాలన్నారు.

December 28, 2024 / 08:34 AM IST

మేనల్లుడిని హత్య చేసిన మేనమామ

VSP: చోడవరం పాత బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి మేనల్లుడిని మేనమామ హత్య చేశాడు. స్థానికంగా రెల్లివీధిలో నివాసం ఉన్న మేనల్లుడు ఎస్ ప్రేమ కుమార్ మేనమామ బంగారు దుర్గ చిత్తు కాగితాలు ఏరుకొని వాటిని విక్రయిస్తూ రోజు మద్యం తాగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇద్దరి మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. మద్యం మత్తులో మేనల్లుడిని చంపినట్టు తెలిపారు. 

December 28, 2024 / 08:34 AM IST

పాము కాటుకు వ్యక్తి మృతి

ప్రకాశం: సొరకాయ కోస్తుండగా పాము కుట్టి వ్యక్తి మృతి చెందిన ఘటన మార్కాపురం మండలం కొట్టాలపల్లిలో శుక్రవారం జరిగింది. అపస్మారక స్థితిలో వున్న గుంజే చెన్నయ్య (45)ను కుటుంబీకులు బైక్ పై మార్కాపురం జీజీహెచ్కు తరలించారు. చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, వెంకటరెడ్డి పరామర్శించారు.

December 28, 2024 / 08:33 AM IST

ఏకలవ్య ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సావిత్రి

SRCL: ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కుర్ర సావిత్రిని ఏకలవ్య గ్లోబల్ ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు EGF వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కె.ఆంజనేయులు తెలిపారు. సావిత్రి మాట్లాడుతూ.. నాయకత్వ అనుభవంతో ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేస్తానని ఏకలవ్య  గ్లోబల్ ఫెడరేషన్ EGF జాతి సంక్షేమం కోసం పని చేస్తానని చెప్పారు.

December 28, 2024 / 08:32 AM IST

మున్సిపల్ పరిధిలోని ఎస్జీటీలకు పదోన్నతులు

NLR: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ యాజమాన్యం పరిధిలో నిర్వహిస్తున్న ఆయా పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 11మంది, కావలి, గూడూరు ముగ్గురికి స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు.

December 28, 2024 / 08:31 AM IST

ఓ వైపు అరెస్ట్.. మరోవైపు గొడవ

అన్నమయ్య: గాలివీడు ఎంపీడీవోపై నిన్న వైసీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఎంపీడీవో ఆఫీసులో వైసీపీ, టీడీపీ నాయకులు మధ్య వాగ్వాదం జరిగింది. సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా నాయకులు పరస్పరం ఘర్షణకు దిగారు.

December 28, 2024 / 08:31 AM IST

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం

గద్వాల్: మల్దకల్ మండలం పావనం పల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెదురు బొంగులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

December 28, 2024 / 08:30 AM IST