NDL: తెలంగాణ మంత్రి కొండా సురేఖ శ్రీశైల మల్లన్న దర్శనం అనంతరం ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను TTD అనుమతించక పోవడంపై మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై TTD స్పందించింది. ఇకపై వారానికి రెండుసార్లు తెలంగాణ మంత్రులు, MLAలు, MPలు, MLCల సిఫార్సు లేఖలను అనుమతించాలని TTD నిర్ణయించింది.
HYD: ఏపీజీవీబీ బ్రాంచ్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నట్లు చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు. బ్రాంచ్‌లో విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు.
BDK: పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా ఆదివారం రుద్రహోమం పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి జరగనున్న హోమంలో పాల్గొనున్న భక్తులు రూ.1,516 చెల్లించి గోత్ర నామాములను నమోదు చేసుకోవాలని కోరారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయానికి తరలించారు. మన్మోహన్ నివాసం నుంచి మిలిటరీ వాహనంలో భౌతికకాయాన్ని తీసుకెళ్లారు. ఉదయం 10 గంటల వరకు పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. 11:45 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, సోనియా కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
VZM: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మక్కువ మండలంలోని గిరి శిఖర గ్రామమైన బాగుజోల పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావిడి సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ ఐపీఎస్‌తో పలువురు పోలీసులు సైతం ఫోటోలు దిగడం చర్చీనయాంశమైంది. కాగా ఆయన ఎవరనేది పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నట్లు తెలిసింది.
NRPT: జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించ తలపెట్టిన నారాయణపేట జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వాయిదా వేస్తున్నట్లు డీఈఓ గోవిందరాజు శుక్రవారం తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలు, నిర్వహణ కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు సైన్స్ ఫెయిర్‌ను జనవరి 3, 4 తేదీలలో ఏర్పాటు చేయనున్నారు.
కోనసీమ: మలికిపురం మండలం మేడిచర్ల పాలానికి చెందిన సుందరయ్య(70) రైల్వే లైన్ కోసం కొత్తగా నిర్మించిన మూడు ఇళ్లను కోల్పోతున్నామనే బెంగతో శుక్రవారం మరణించాడు. కోటిపల్లి నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా అతనికి చెందిన మూడు గృహాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. ముగ్గురు కొడుకుల కోసం కట్టిన ఇల్లులను కోల్పోతామన్నా బెంగతో మరణించాడు.
KNR: ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని జమ్మికుంట సీఐ వరగంటి రవి ఓ ప్రకటనలో తెలిపారు. రోడ్లపై కేక్ కటింగ్, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిస కావద్దని ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని సూచించారు.
వరంగల్: కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో చాలా రోజులుగా పులి సంచరిస్తున్న నేపథ్యంలో మండలంలోని ఓటాయి, కోనాపురం, సాదిరెడ్డిపల్లి పరిధిలోని అడవి ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. డీఎస్ఓ విశాల్ ఆదేశాల మేరకు కొత్తగూడెం అడవి ప్రాంతాన్ని ఎఫ్ఆర్డీ వాజహత్ క్షుణ్ణంగా పరిశీలించారు. పాదముద్రలు ఆధారంగా పులిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
నెల్లూర: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమం పలు ప్రాంతాలలో ముమ్మరంగా సాగింది. ఆత్మకూరు, బుచ్చి, వెంకటాపురం, ఉదయగిరి తదిదర ప్రాంతాలలో ఆ పార్టీ నేతలు కాకాణి, ఆదాల, విక్రమ్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆందోళనలు పెద్ద ఎత్తున సాగాయి.
ATP: గుంతకల్లు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద శనివారం తెల్లవారుజామున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐటీయూసీ మున్సిపల్ పారిశుద్ధ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు వీరభద్రస్వామి మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
NLR: ఉదయగిరి యూటీఎఫ్ కార్యాలయంలో ప్రాంతీయ మండలాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మండల బాధ్యులు, జిల్లా బాద్యులు, సీనియర్ నాయకులు, ముఖ్య బాధ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాకినాడలో జరగబోయే 50వ యూటీఎఫ్ రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభల విజయవంతం, జనవరిలో నిర్వహించాల్సిన కర్తవ్యాలు వంటి అంశాల గురించి వారు చర్చించుకున్నారు.
HYD: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం ప్రజావాణిలో 154 అర్జీలు వచ్చాయి. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 59, విద్యుత్ శాఖకు 26, రెవెన్యూ శాఖకు 18, హోం శాఖకు 8, వ్యవసాయ శాఖకు 5, ఇతర శాఖలకు సంబంధించి 38 అర్జీలు వచ్చాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
KNR: హుజురాబాద్ పట్టణంలో ACP శ్రీనివాస్ వాహనాలను తనిఖీలు చేయగా సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ & డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ Dec 31 నుంచి Jan 1 వరకు ఉంటుందని అన్నారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.
కృష్ణా: మచిలీపట్నం రూరల్ మండలం చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగ నోట్ల ఘటనలో నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అబ్దుల్ నబీ తెలిపారు. శుక్రవారం రాత్రి సీఐ మాట్లాడుతూ.. దొంగ నోట్ల చలామణికి సంబంధించి రూ. 6,500 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు.