కడప: మైదుకూరు డిపోకి చెందిన ఆర్టీసీ కండక్టర్ మాధవి బంగారం, ఫోన్, ఇతర వస్తువులతో ఉన్న బ్యాగ్‌ను అందజేసి ప్రయాణికుల మన్నలను పొందారు. వివరాల్లోకి వెళ్తే.. పోరుమామిళ్లలో ఆ మహిళ ఒక బస్సు బదులు మరొక బస్సు ఎక్కి బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగ్‌ను మర్చిపోయింది. ఈవిషయాన్ని కంట్రోలర్ నాగరాజు ద్వారా సమాచారాన్ని బస్సు కండక్టర్‌కు చెప్పి ఆమె బ్యాగ్ గుర్తించి అందజేశారు.
బాపట్ల: పట్టణంలో ఉన్న వాటర్ ప్లాంట్ యజమానులతో శనివారం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్ యజమానులు తప్పకుండా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. మూడు నెలలకు ఒకసారి గ్రౌండ్ వాటర్ మారుతుందని, కాబట్టి వాటర్ టెస్ట్ చేయించుకుని నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. త్వరలో ప్లాంట్లన్నీ తనిఖీ చేస్తామన్నారు.
NZB: పోగొట్టుకున్న మొబైల్ ఫోనును మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తిరిగి బాధితులకు అప్పగించారు. నెల క్రితం మోర్తాడ్ గ్రామానికి చెందిన కొత్తూరు జగదీష్ తన మొబైల్ ఫోనును పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు CEIR పోర్టల్ ఆధారంగా పోయిన ఫోన్ ఆచూకీ కనిపెట్టి తిరిగి అప్పగించామని ఎస్సై విక్రమ్ తెలిపారు.
HYD: మురుగునీటి శుద్ధిలో అత్యున్నత ప్రమాణాల నిర్వహణ నేపథ్యంలో పకడ్బందీ పర్యవేక్షణ విధానానికి జలమండలి శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్, చుట్టుపక్కల ఇప్పటి వరకు 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు(STPలు) అందుబాటులోకి రాగా మరో 9 STPల పనులు జరుగుతున్నాయి.
ADB: మావల మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న కార్‌కు మావల జాతీయ రహదారిపై కుక్క అడ్డు వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో పక్కనున్న చెట్ల పొదల్లోకి కారు దూసుకు పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న పవన్, ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
W.G: రైల్వే తీగల మరమ్మతుల నిర్వహణ నిమిత్తం నాగర్ సోల్- నరసాపురం మధ్య ప్రయాణించే రైళ్లను రద్దు చేసినట్లు ఆ శాఖ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పలు మరమ్మతుల కారణంగా 12788, 17232 నంబర్ రైళ్లను ఈ నెల 28 నుంచి జనవరి 3 వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. కావున ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సందర్భంగా స్వామివారికి పంచామృతా కుంకుమార్చనలు చేపట్టి స్వామివారిని విశేషంగా అలంకరించి నైవేద్యాలు అందించారు. ధనుర్మాసం సందర్భంగా మహిళ భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
మేడ్చల్: ఉప్పల్ పరిధి లక్ష్మణ్ కాలనీ, రాఘవేంద్రనగర్ కాలనీ, గాయత్రీనగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద వేధిస్తోంది. రాత్రి అయితే చాలు పదుల సంఖ్యలో వీధి కుక్కలు రోడ్లపైకి వచ్చి అరుస్తున్నాయని వాపోతున్నారు. రాత్రి పూట బయటకు రావాలంటే భయమేస్తోందన్నారు. కుక్కలను పట్టుకుని తీసుకెళ్లాలని స్థానికులు కోరారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు AICC ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు మన్మోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కాగా, నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
SRCL: వేములవాడ పట్టణంలో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అక్కడ ఆయన చేతిపై ఓ చిలుక వచ్చి వాలింది. చేతిపై ఉన్న గడియారాన్ని చిలుక ఆసక్తిగా చూస్తూ కాసేపు ఉండటంతో కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనం సందడి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే చేతిపై చిలుక వాలడం వింతగా ఉందని నాయకులు ఆ సన్నివేశాన్ని ఆసక్తిగా చూశారు.
అన్నమయ్య: గాలివీడులో వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును శనివారం ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ నాయకుడు అతికారికృష్ణ పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. అనంతరం నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీవోను పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను కృష్ణ పరిశీలించారు.
MBNR: ఉన్నత లక్ష్యం నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా మంచిగా చదువుకొని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్‌ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో గ్రంథాలయం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా కొత్త సంవత్సరం ప్రారంభించుకుందామన్నారు.
PLD: బలుసుపాడు గ్రామంలో టీడీపీకి ఓటు వేశాడని మంటి బాబుపై అర్ధరాత్రి సింగం నాగమల్లేశ్వరరావు, మరికొందరు దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. ఇంట్లోకి చొరబడి అన్నం తింటున్న తనని బయటికి లాక్కొచ్చి దాడి చేసి, కుటుంబ సభ్యులను గాయపరిచారన్నారు. బాధితుడి కేకలతో స్థానికులు రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
WGL: వరంగల్ కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 11 గంటలకు స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశరదా ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు స్పెషల్ గ్రీవెన్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
TPT: తిరుపతి తిరుణాచూరులోని ప్రసిద్ది గాంచిన పద్మావతి అమ్మవారిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పద్మావతి అమ్మవారిని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పెనుకొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.