SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం శని త్రయోదశి విశిష్టమైన రోజు కావడంతో ఆలయంలోని నవగ్రహాలకు శనీశ్వరునికి భక్తులు విశేష పూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా చేస్తూ భక్తులు కోరిన కోరికలు నెరవేరే విధంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
HYD: దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. మొత్తం 20 రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 1 నుంచి మార్చి నెల వరకు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా రైళ్ళను పొడిగించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.
NRML: శనివారం సీఐ నవీన్ కుమార్ సోన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ నెల వారి రికార్డులను, కేసులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో ఎలాంటి సంఘటనలు జరగకుండా విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఇందులో ఎస్సై షేక్ అహ్మద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: జనవరి 1న పుట్టపర్తికి వస్తున్నట్లు జబర్దస్త్ యాక్టర్ గల్లీబాయ్ రియాజ్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4గంటలకు శిల్పారామంలో నిర్వహించే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఈ మేరకు రియాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.
BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం చేతుల మీదగా నూతన సంవత్సరం నవతెలంగాణ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పాత్రికేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
NTR: ప్రపంచ 6వ తెలుగు మహాసభలు శనివారం KBN కాలేజీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు నిర్వాహకులు 3 సభావేదికలు సిద్ధం చేశారు. సుప్రీం కోర్టు మాజీ CJI ఎన్వీ రమణ, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి 1500 మందికిపైగా కవులు, రచయితలు ఈ సభలకు తరలివచ్చారు.
AP: విజయవాడలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి విశ్రాంత CJI జస్టిస్ NV రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, MLA బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫోటో ప్రదర్శనను తిలకించారు. కాగా.. ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి తెలుగు రచయితలు వచ్చారు.
NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, శ్రీ గురురాజా పాఠశాల అధినేత డా.పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి తెలిపారు. కోవెలకుంట్ల తాలూకా పరిసర మండలాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని దస్తగిరి రెడ్డి కోరారు.
KMM: సత్తుపల్లిలో శనివారం తెలుగు రాష్ట్రాల స్థాయిలో భక్త సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు శ్రీ రామకృష్ణ మఠం (హైదరాబాద్) అధ్యక్షుడు స్వామి బొదమయానంద మహరాజ్, బాధ్యుడు స్వామి పూజనానంద మహరాజ్, స్వామీ శితికంఠానంద మహరాజ్‌లతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరవుతారన్నారు.
KMM: పోలవరం మండల పరిషత్‌లో శనివారం జరగాల్సిన సర్వసభ్య సమావేశం జనవరి 7వ తేదీకి వాయిదా వేశామని MPDO శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్న కారణంగా సమావేశం వాయిదా వేశామన్నారు. జనవరి 7వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.
HYD: గాంధీ ఆసుపత్రి వెనుక ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాది మంది ఈ రూట్‌లో రాకపోకలు సాగిస్తుంటారు. కొంతమంది ఇక్కడే మూత్ర విసర్జన చేయడం గమనార్హం. ఇకనైనా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే పేరుకుపోతున్న చెత్తను కూడా తొలగించాలన్నారు.
NZB: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు జనవరి 4న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్-2025 పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 99664 40700 (నిజామాబాద్), 93946 80680 (కామారెడ్డి) జనవరి 2వ తేది వరకు అవకాశం ఉంటుందన్నారు.
KRNL: కడప మహిళకు కర్నూలులో వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. కడపకు చెందిన రమణమ్మ గత కొన్నినెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. పరీక్షించిన వైద్యులు కిడ్నీ, లివర్‌కు దగ్గరలో రక్తనాళాలు ఆనుకొని 8.సెం.మీ గడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఆమెను కర్నూలుకు రెఫర్ చేయగా.. యురాలజీ HOD డా. కే. సీతారామయ్య బృందంతో మూడు గంటలపాటు శ్రమించి కణితిని తొలగించినట్లు తెలిపారు.
HYD: షేక్ పేట్ డివిజన్‌లో విద్యుత్ శాఖ అధికారుల తీరు భిన్నంగా కనిపిస్తోంది. సూర్యనగర్ కాలనీలో 8 నెలల క్రితం అధికారులు కొత్తగా 40 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. అయితే వాటికి లైట్లు పెట్టడం మర్చిపోయారు. దీంతో 8 నెలలుగా విద్యుత్ స్తంభాలు అలంకారప్రాయంగా మారాయి. అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన స్పందన మాత్రం కరువైందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.