TPT: ఏర్పేడు ఏఎస్సైగా ఎన్.శ్రీకాంత్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఆయనకు సిబ్బంది బొకేలతో స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
ఒంగోలు 32వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ తాడి కృష్ణలత, ఆమె భర్త వెంకటేశ్పై శుక్రవారం అర్ధరాత్రి కొందరు దాడి చేశారు. దాడికి పూర్తి కారణాలు తెలియనప్పటికీ వ్యక్తిగత విభేదాలతో వారిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో మద్యంమత్తులో వారిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. కాగా వారు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
KRL: పత్తికొండ నుంచి ఎమ్మిగనూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు శనివారం ఆస్పరి మండలం కైరుప్పల గ్రామ సమీపంలో స్టీరింగ్ విరిగిపోవడంతో అదుపుతప్పి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గాయాలైన వారిని ఆస్పరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని 20 డివిజన్ నక్కలగుంటలో 7వ రోజు శనివారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ గిరిధర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్నామని, తమకు వేతనాలు పెంచడం లేదని వారు వాపోయారు. గ్రామపంచాయతీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు రెట్టింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కడప: రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన రిమ్స్ ఆసుపత్రికి చేరుకోగా.. జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఇతర అధికారులు స్వాగతం పలికారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఎంపీడీవో జవహర్‌ను పరామర్శించనున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.
PLD: నరసరావుపేట పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులతో ఎమ్మెల్యే శనివారం మాట్లాడారు. డంపింగ్ యార్డ్ నుంచి పొగ రాకుండా చూసుకోవాలన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డ్ తరలింపునకు సంబంధించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
JGL: గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురై వారం రోజుల కింద జగిత్యాల ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి సాయంగా భార్య మల్లవ్వ ఉంటోంది. ఈ క్రమంలో ఆమె హై బీపీతో బాధపడుతూ సొమ్మసిల్లి కింద పడిపోయింది. వైద్యం అందిచాల్సిన ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయట రోడ్డుపై పడేశారు.
రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌కు వైద్యం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును ధర్మాసనం తప్పుపట్టింది. దల్లేవాల్ క్షేమం కోరుకునే వాళ్లు అలా అడ్డుకోరని, ఈ విషయాన్ని వారికి తెలియచేయాలని పంజాబ్ చీఫ్ సెక్రటరీకి సూచించింది. కాగా.. దల్లేవాల్ నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు పాల్గొని, తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
బీసీలను, మరీ ముఖ్యంగా యాదవులను అణగదొక్కాలన్న లక్ష్యంతో మాజీ జడ్పీటీసీ, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట శేషయ్యపై అక్రమంగా కేసు నమోదు చేశారని శనివారం వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. చెప్పుడు గుంటలోని జిల్లా సెంట్రల్ జైల్లో వెంకట శేషయ్యను ఆయన పలకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ADB: బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలోని శబరిమాత ఆశ్రమంలో అయ్యప్ప స్వాముల పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు నగేశ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎంపీ నగేశ్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు రాజు, తులసి రామ్, శ్రీనివాస్ తదితరులున్నారు.
GDWL: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాసుల హనుమంతు నాయుడు అన్నారు. శనివారం గట్టు మండలం ఇందువాసి గ్రామంలో క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటల్లో సమయస్ఫూర్తిని కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారులు సమయస్ఫూర్తి, క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని క్రీడాకారులకు సూచించారు.
AP: గన్నవరం నుంచి కడప విమానాశ్రయం డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి రిమ్స్‌కు బయలుదేరారు. కాసేపట్లో రిమ్స్‌లో గాలివీడు MPDO జవహర్ బాబును పరామర్శించనున్నారు. కాగా, ఎంపీడీవోపై దాడి ఘటనలో 13 మందిపై గాలివీడు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
NGKL: వంగూర్ మండలం యూటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు శనివారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న యుటిఎఫ్-6వ విద్యా, వైజ్ఞానిక సదస్సుకు బయలుదేరి శనివారం వెళ్లారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిన్నయ్య మాట్లాడుతూ.. ఈ వైజ్ఞానిక సదస్సుకు రాష్ట్రం నుండి వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యా వేత్తలు పాల్గొంటున్నారని అన్నారు.