W.G: కార్మికుల పక్షాన సమరశీల పోరాటాలు చేస్తున్న సీఐటీయూ ఆల్ ఇండియా మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి పీ.వీ ప్రతాప్ కోరారు. సోమవారం తణుకు అమరవీరుల భవనంలో సీఐటీయూ మండల సమావేశం జరిగింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. ఈనెల 15న మహాసభలు ప్రారంభ సూచికంగా అన్ని యూనియన్ కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరణ చేయాలని కోరారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కె.శంకర అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నిక చెల్లదని, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం సిద్ధరామయ్య అవినీతికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
KMR: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువ ద్వారా యాసంగికి నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ప్రాజెక్ట్ అధికారులు నేడు ఉదయం ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి సోమవారం ఉదయం 550 క్యూసెక్కులు నీటిని ప్రధాన కాలువకు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TG: కాసేపట్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సదస్సు వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదికపై రేవంత్ ప్రసంగించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు.
2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరాలంటే వందేమాతరం స్ఫూర్తి అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ‘జననీ జన్మభూమిశ్చ’ అన్న రాముడి మాటలకు వందేమాతరం మరో రూపమని ఆయన పేర్కొన్నారు. వందేమాతరం ఉద్దేశాన్ని, గౌరవాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశ ఐక్యతకు ఈ గీతం చిహ్నంగా నిలిచిందని తెలిపారు. వందేమాతరంపై చర్చలో స్వపక్షం, విపక్షం అంటూ తేడా లేదని పేర్కొన్నారు.
RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
E.G: ప్రముఖ సినీ నటి జయసుధ చాగల్లు, రామచంద్రపురంలో పర్యటించారు. అక్కడ జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ముందుగా రాజమండ్రిలోని మాజీ ఎంపీ హర్ష కుమార్ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలోని గోదావరి అందాలు అద్భుతమని, అలాగే ఇక్కడ ప్రజలు అందించే ప్రేమ, ఆప్యాయతానురాగాలు తనకు ఎంతో ఇష్టమన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు.
KMM: కూసుమంచి మండలం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్ అన్నారు. సోమవారం కూసుమంచిలో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణవేణి గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.
CTR: కుప్పం మున్సిపాలిటీ 22వ వార్డులోని గుడిపల్లె రోడ్డు సర్కిల్ నుంచి పెద్దపర్తి కుంట గ్రామ వరకు నూతనంగా మంజూరైన రూ. 5.16 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ చేశారు. ఇన్నాళ్లుగా ఇరుకుగా.. ధ్వంసమైన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతుండేవారు. ప్రజలు ఇబ్బందులను తొలగిస్తూ రోడ్డు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
MNCL: గ్రామ ఎన్నికల నేపథ్యంలో తాండూరు మండలంలో సోమవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మండలంలోని రేపల్లె వాడ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కారులో వస్తున్న మండల TDP అధ్యక్షుడి కారును ఆపి చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ASI రవి, DT కల్పన పాల్గొన్నారు.
NZB: కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే ఇందిరమ్మ ఇళ్ల వస్తుందని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన బోధన్ మండలం అమ్దాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యే ఎవరు ఉన్నా సర్పంచి తీర్మానం ద్వారా మాత్రమే ఇళ్లు వస్తాయన్నారు.
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుపై ఆమిర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని, కథ, కథనాలపై వర్క్ జరుగుతుందని వెల్లడించాడు. ఇటీవల లోకేష్ తనకు కాల్ చేసి మాట్లాడాడని, త్వరలోనే ముంబై వచ్చి పూర్తి స్క్రిప్ట్‌ని వినిపిస్తానని చెప్పాడని తెలిపాడు.
బాపట్ల: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ ఎన్ హెచ్ 216పై సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వారికి చలానాలు విధించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాహనదారులకు వివరించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
W.G: ఆల్ ఇండియన్ స్టూడెంట్స్ బ్లాక్ (AISB) జిల్లా నూతన కమిటీ ఎన్నికలు సోమవారం తణుకులో జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వంశీ సమక్షంలో జరిగిన కమిటీలో అధ్యక్షుడిగా దున్న వెంకట్, ఉపాధ్యక్షుడిగా గంగోలు సాయి, తణుకు టౌన్ అధ్యక్షుడిగా తానేటి అమృత్, ఉపాధ్యక్షుడిగా సంకర పృథ్వీరాజ్, కార్యదర్శిగా కోట ఖాదర్ సింగ్ ఎన్నికయ్యారు.
GDWL: ఇటిక్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆకేపోగు రాంబాబు సోమవారం గ్రామంలో ప్రచారం నిర్వహించి 20 కీలక హామీలను ప్రజలకు వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పన, ప్రధాన రహదారికి ఆనుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి 3,016 రూపాయల ప్రోత్సాహకం వంటి అంశాలను ఆయన ప్రజల ముందుంచినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ హామీలు ఇప్ప...