అన్నమయ్య: నూతన సంవత్సర వేడుకలు మదనపల్లె పట్టణంలో ఘనంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఎమ్మెల్యే షాజహాన్ భాషను హైదరాబాద్‌కు చెందిన నటుడు ఉప్పల్ బాలు ఆయన స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ వేడుకలకు తప్పక హాజరు అవుతానని అన్నారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్యే జరుపుకోవాలని సూచించారు.
VSP: పెందుర్తిలో 24వ సీపీఎం మహాసభలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. దీనిలో భాగంగా శనివారం సీపీఎం శ్రేణులు మహా ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు లోకనాథం మాట్లాడుతూ.. కార్మిక కర్షక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తున్నట్లు తెలిపారు. సీపీఎం ఎన్నో ఉద్యమాల ద్వారా పలు సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
GNTR: వెంకటపాలెంలోని టీటీడీ వారు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను శనివారం మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ సందర్శించారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
NRML: ఈనెల 31న ఆశా కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టారు. అందులో భాగంగా శనివారం నిర్మల్ జిల్లా ఆశా కార్యకర్తలు చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతిని కోరుతూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్‌కు వినతి పత్రం సమర్పించారు. అధ్యక్షురాలు సబిత మాట్లాడుతూ.. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
VZM: జామి మండలం భీమసింగి సచివాలయాన్ని ఎంపీడీవో అప్పలనాయుడు శనివారం సందర్శించారు. సచివాలయంలో సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పలు సర్వేల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలని సూచించారు.
BDK: అశ్వాపురం మండలం నెల్లిపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
NDL: డోన్ నియోజకవర్గం కమ్మ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటకృష్ణారెడ్డి, రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కమ్మ సంఘం 2025 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరం ఐకమత్యంగా ఉండి సంఘం అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కమ్మ సోదరులు మురళి, కిషోర్, శ్రీనివాసులు, ఉన్నం రవి పాల్గొన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చిన్నరావుపల్లి గ్రామంలో రెవెన్యూ గ్రామ సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రెవిన్యూ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డీటీ త్రినాధరావు, మండల సర్వేయర్ రఘు, విఆర్ఓ సన్యాసిరావు, సచివాలయ సర్వేయర్ జగపతి, తదితరులు పాల్గొన్నారు.
NTR: విజయవాడలోని మెగా జాబ్ మేళా శనివారం ప్రారంభమైంది. ఈ జాబ్ మేళా సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో వ్యక్తి భారత్ పేరుతో నిర్వహిస్తున్నారు. స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు చౌదరి, ఉమ వంటి పలువురు నాయకులు జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ జాబ్ మేళాలో మొత్తం 60 కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.
కడప: జిల్లాలో గాలివీడు MPDO జవహర్ బాబుపై శుక్రవారం జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఖండించారు. దాడి ఘటనపై కడప రిమ్స్ వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అహంకారంతో చేసిన పనులకే మీరు 11 సీట్లకు పరిమితమయ్యారని మండిపడ్డారు. తాను కడపకు రావడానికి జవహార్ దాడి జరగడం మాత్రమే కాదని, ఇది ప్రభుత్వంపై జరిగిన దాడిగా గుర్తించి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
W.G: తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యత అందిస్తున్నామని, వైద్య ఖర్చులు ఎక్కువైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు.
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన తిమ్మప్ప స్వామిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.
బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. 164/5 వద్ద రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కాసేపటికే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులో వచ్చిన సుందర్, నితీష్ కుమార్ రాణించడంతో భారత్ 359/9 స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజులో నితీష్(105*), సిరాజ్(2*) ఉన్నారు. భారత్ ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది.
NRPT: హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని శనివారం ఆయన నివాసంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించినట్లు చెప్పారు. ఆయన వెంట మాజీ మార్కెట్ వైస్ ఛైర్మన్ అనిల్ గాయత్రి, నాయకులు ఉన్నారు.
AKP: యలమంచిలి మున్సిపాలిటీ 25వ వార్డు ఎన్టీఆర్ కాలనీ సచివాలయ పరిధిలో శనివారం స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ శ్మశాన వాటికలో మాస్ క్లిన్సీనెస్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.