• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు 5 గంటల వరకే ప్రచారం: కలెక్టర్

MDK: గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలకు తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.

December 9, 2025 / 07:40 AM IST

కేయూలో నోబెల్ ప్రైజ్ డే ఉత్సవాలు..!

HNK: కేయూలో నోబెల్ ప్రైజ్ డే ఉత్సవాలను నేడు, రేపు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో పరిశోధన, సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, లైఫ్సెన్స్, ఫార్మసీ, ఆర్థికశాస్త్రం, ఇంగ్లిష్ విభాగాల విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, నిర్వహించనున్నారు.

December 9, 2025 / 07:38 AM IST

సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు పాలమూరు జట్టు

MBNR: పాలమూరు యూనివర్సిటీ పురుషుల వాలీబాల్ జట్టు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొనడానికి సోమవారం కాకినాడకు బయలుదేరింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు జేఎన్టీయూ కాకినాడలో ఈ పోటీలు జరగనున్నాయి. ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి, క్రీడా దుస్తులు అందజేశారు. శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్ పాల్గొన్నారు.

December 9, 2025 / 07:36 AM IST

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఓటు చోరీ పై అవగాహన.!

MDK: ఓటు చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఓటు చోరీ పై మెదక్‌లో సంతకాల సేకరణ సమీక్షా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ పాల్గొన్నారు.

December 9, 2025 / 07:34 AM IST

ఎన్నికల దృష్ట్యా బైండోవర్

SRPT: పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మోతే మండల పరిధిలోని ఆరు గ్రామాలకు చెందిన 73 మందిని సోమవారం సాయంత్రం, మోతె తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు స్థానిక ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్,బీఆర్ఎస్, సీపీఏం పార్టీల ముఖ్య నాయకులు, సర్పంచి పదవులకు నామినేషన్ దాఖలు చేసిన వారిని రూ.2 లక్షల పూచీకత్తుతో  బైండోవర్ చేసినట్టు తెలిపారు.

December 9, 2025 / 07:33 AM IST

నేటి నుంచి వైన్స్‌లు బంద్

VKB: ఈ నెల 11న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎక్సైజ్‌శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి 11 తేదీ వరకు మద్యం దుకాణాలు కళ్లు కాంపౌండ్లు బంద్ చేయాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. తాండూర్, యాలాల్, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్, దుద్యాల మండలాల్లో వైన్స్‌లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని చెప్పారు.

December 9, 2025 / 07:32 AM IST

నిర్మల్ నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

NRML: నిర్మల్ నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. నిర్మల్ నుంచి కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, శబరిమల వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మధురై నుంచి నిర్మల్‌కు వస్తుందన్నారు. 6 రోజుల ప్రయాణంలో ఒకరికి టికెట్ ధర రూ.7,650 ఉంటుందని స్పష్టం చేశారు.

December 9, 2025 / 07:32 AM IST

నేడు అమరావతిలో పర్యటించనున్న మంత్రి నారాయణ

GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 8:30 నిమిషాలకు CRDA కార్యాలయం వద్ద బయలుదేరి అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం రోడ్ల నిర్మాణ పరులను పరిశీలించి మీడియాతో మంత్రి మాట్లాడతారని వెల్లడించారు.

December 9, 2025 / 07:32 AM IST

ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై డీఐజీ సమీక్ష

NGKL: జిల్లాలో పంచాయతీ ఎన్నికల భద్రతా చర్యలను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సమీక్షించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియా అపోహలపై కఠిన చర్యలు, సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు.

December 9, 2025 / 07:28 AM IST

రైతు భరోసా పథకం అందడం లేదు

AKP: రైతు భరోసా,పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయం అందడం లేదని పాయకరావుపేటకు చెందిన విసరపు దుర్గ భవాని శంకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు అదే మండలం అరట్లకోటలో 2.50 ఎకరాల భూమి ఉందన్నారు. ఆన్ లైన్‌లో తన పేరు చూపిస్తున్నా తన ఖాతాలో డబ్బులు పడలేదన్నారు. అధికారులకు సమస్య తెలియజేసిన స్పందించలేదన్నారు.

December 9, 2025 / 07:27 AM IST

వరంగల్ MGMలో భారీ స్కాం ఆరోపణలు

వరంగల్ MGM ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది వేతనాలు, PF చెల్లింపుల్లో కోతలు పెడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 675 మందికి రూ.12వేలు PF చెల్లించాల్సి ఉండగా 500 మందికి రూ. 8600 చెల్లించి నెలకు రూ.40 లక్షలు వెనకేసుకుంటున్నట్లు సమాచారం. శానిటేషన్ బిల్లుల్లో పరిపాలన ఉద్యోగి, RMO చక్రం తిప్పి రూ.4 లక్షలు జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

December 9, 2025 / 07:26 AM IST

11న 2వేల మందికి ఉచిత సైకిళ్లు పంపిణీ: మంత్రి

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ కుమార్తె పేరుతో నిర్వహించే ‘సంస్కృతి’ సేవా సంస్థ ద్వారా ధర్మవరంలో 2 వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 11న మధ్యప్రదేశ్ CM మోహన్ యాదవ్ చేతుల మీదుగా ఈ పంపిణీ జరగనుంది. దీని కోసం రూ.98 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. నిరుద్యోగ యువతకు సివిల్స్, బ్యాంకింగ్ రంగాలలో ఉచిత శిక్షణ కూడా ఇప్పించనున్నారు.

December 9, 2025 / 07:23 AM IST

రాష్ట్ర కమిటీ సభ్యులుగా సిగి చెన్నయ్య

అన్నమయ్య: జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన సిగి చెన్నయ్యను సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 6, 7 తేదీలలో కడపలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

December 9, 2025 / 07:23 AM IST

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్

BHPL: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే రేగొండ, గణపురం, గోరికొత్తపల్లి, మొగుళ్లపల్లి మండలాల్లో మంగళవారం ఉదయం 5 గంటల నుంచి గురువారం ఫలితాల ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు బ్రాందీ షాపులు మూసివేస్తారు. ఎన్నికలు సజావుగా జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

December 9, 2025 / 07:21 AM IST

వ్యాయామశాలను తనిఖీ చేసిన కమిషనర్

KDP: ప్రొద్దుటూరులోని స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ పాఠశాల ఆవరణలోని వ్యాయామశాలను సోమవారం మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తనిఖీ చేశారు. స్థానికులు అక్కడి పరికరాలు విరిగిపోయాయని, పాడైపోయాయని ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్, వెంటనే మరమ్మతులు చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

December 9, 2025 / 07:20 AM IST