• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పేరపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి ప్రచారం

NLG: చిట్యాల మండలంలోని పేరేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రూపని సోనియా లింగస్వామి, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన వరికుప్పల బిక్షపతి, వరికుప్పల ఎల్లయ్య, వరకుప్పల నరేందర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

December 8, 2025 / 04:47 PM IST

వారంరోజుల్లో 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో మొత్తం 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు. ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించారు.

December 8, 2025 / 04:47 PM IST

పెనమలూరులో తాగునీటి సమస్య పరిష్కారం

కృష్ణా: పెనమలూరు గ్రామ హరిజనవాడలో కలుషితమైన మంచినీటి పైపు డమ్మీల సమస్యపై అక్కడి ప్రజల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తక్షణమే అధికారులను చర్యలకు ఆదేశించారు. తదనంతరం సిబ్బంది పాడైన పైపులను తొలగించి సమస్యను పరిష్కరించారు.

December 8, 2025 / 04:47 PM IST

సర్పంచ్ బరిలో రిటైర్డ్ IPS అధికారి సతీమణి

PDPL: సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ IPS అధికారి ఉప్పు తిరుపతి సతీమణి లక్ష్మి సర్పంచ్‌గా బరిలోకి దిగారు. పలు ప్రాంతాల్లో పనిచేసిన అనుభవంతో స్వగ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వస్తున్నానని ఆమె అన్నారు. గ్రామంలో గుడి, బడి, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేయడంతోపాటు కోతుల బెడదను సొంత ఖర్చుతో తొలగించామని తెలిపారు.

December 8, 2025 / 04:47 PM IST

గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

కరీంనగర్ పట్టణానికి చెందిన దేవేందర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్‌లోని గాంధీ చౌరస్తాలో మధ్యాహ్నం 12 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లగానే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, దేవేందర్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. దీంతో పోలీస్ శాఖలో విషాదఛాయలు అలముకున్నాయి.

December 8, 2025 / 04:46 PM IST

సమాజ అభ్యున్నతిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ELR: సమాజ అభ్యున్నతిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ దెందులూరు నియోజకవర్గ స్థాయి సమావేశం ఇవాళ పెదవేగిలో జరిగింది. అనంతరం చింతమనేని మాట్లాడుతూ.. వ్యవస్థలో జరిగే తప్పులను నిష్పక్షపాతంగా ఎత్తిచూపటమే అసలైన జర్నలిజం అని అన్నారు.

December 8, 2025 / 04:46 PM IST

తెలంగాణ వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు: కోమటిరెడ్డి

TG: 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్ పోర్టులు, డ్రైపోర్ట్ నుంచి కోస్టల్ ఏరియా కనెక్టివిటీ, సౌత్ ఇండియా స్టేట్స్ కనెక్టివిటీ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవేలు లాంటి ప్రణాళికతో వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో పూర్తిగా 4 లేన్ల రోడ్లు రాబోతున్నాయన్నారు.

December 8, 2025 / 04:45 PM IST

ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి

PDPL: ఓదెలలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులతో సందడి నెలకొంది. భక్తులు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించి, బోనాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. భక్తులు తలనీలాలు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

December 8, 2025 / 04:44 PM IST

సోలార్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ

చిత్తూరు: సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో గుడిపల్లిలో పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. 30 ఎకరాలలో 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. రైతులు పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిని ఇచ్చి అభివృద్ధిలో భాగమవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ వెల్లడించారు.

December 8, 2025 / 04:43 PM IST

18 మంది కాంగ్రెస్ సర్పంచ్‌లకు ఎమ్మెల్యే సన్మానం

BHPL: మొదటి, రెండో విడతల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 18 మంది కాంగ్రెస్ సర్పంచ్‌లకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఇవాళ మంజూరునగర్ క్యాంప్ కార్యాలయంలో సన్మానించారు. ప్రజల సంఘీభావంతో ఏకగ్రీవం ప్రజాస్వామ్య మంచి సంప్రదాయమని, పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

December 8, 2025 / 04:43 PM IST

‘వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం’

MNCL: స్థానిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో వైద్య సిబ్బంది కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సూచించారు. సోమవారం జన్నారంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 11న పోలింగ్ కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది యూనిఫామ్‌తో విధులకు హాజరు కావాలన్నారు.

December 8, 2025 / 04:42 PM IST

బాలకృష్ణ నగర్ డ్రైనేజీ సమస్యకు లైన్ క్లియర్

MDCL: రామంతపూర్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. బాలకృష్ణ నగర్‌లో డ్రైనేజ్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాసిం గౌడ్ తెలియజేయగా, వెంటనే MD అశోక్ రెడ్డితో మాట్లాడి మెయిన్ లైన్ సాంక్షన్ చేయించారు. సబ్‌లైన్ ఏర్పాటు కోసం కాలనీవాసులు సమర్పించిన వినతిని స్వీకరించారు.

December 8, 2025 / 04:42 PM IST

‘అర్జీల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’

PPM: పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి కలెక్టర్ వినతులను స్వీకరించారు.

December 8, 2025 / 04:40 PM IST

అవినీతి ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్: కలెక్టర్

KMM: అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ACB పోస్టర్‌ను విడుదల చేశారు. అవినీతిపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1064తో పాటు, వాట్సాప్, ఈమెయిల్, ACB, ఖమ్మం DSP నంబర్ 9154388981 ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

December 8, 2025 / 04:39 PM IST

వినతులను స్వీకరించిన ఎస్పీ

AKP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో ఎస్పీ తుహిన్ సిన్హా మొత్తం 66 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలు 31, కుటుంబ కలహాలు 3, మోసపూరిత వ్యవహారాలు 3, ఇతర శాఖలకు చెందినవి 29 ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారించి 7 రోజుల్లో నివేదికలు సమర్పించాలని అధికారులు ఆదేశించారు.

December 8, 2025 / 04:38 PM IST