• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేటి నుంచి ఉచిత శిక్షణ.. సద్వినియోగం చేసుకోండి

MBNR: సీసీటీవీ కెమెరా ఇన్సలేషన్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. నేటి నుంచి 13 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

December 28, 2024 / 11:27 AM IST

కస్తూర్బా గాంధీ పాఠశాల బాలికల నిరసన

JGL: మల్యాల మండలంలోని కేజీబీవీ పాఠశాల బాలికలు ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలకు చెందిన టీచర్స్ సమ్మెకు వెళ్లడంతో అధికారులు తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కేటాయించారు. అయితే తమ టీచర్స్ తమకే కావాలని బాలికలు పాఠశాల ఆవరణలో బైటాయించి నిరసన తెలిపారు. డీఈవో ఫోన్ చేసి మాట్లాడడంతో బాలికలు నిరసన విరమించి క్లాసులోకి వెళ్లారు.

December 28, 2024 / 11:25 AM IST

మూడు నెలలు అయినా ఇంకా తీయని కాలవ పూడిక

VZM: గరివిడి మెయిన్ రోడ్‌లో ఉన్న కాలవలో పూడిక గత మూడు నెలలుగా తీయడంలేదని స్థానికులు వాపోతున్నారు. కూరుకుపోయిన బురద వలన రోడ్డు మార్గాన్న పోయే ప్రయాణికులకు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. కాలవలో ఉన్న కుళ్ళిన బురద వలన దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి సమస్యని పరిష్కారించాలని కోరుతున్నారు.

December 28, 2024 / 11:23 AM IST

వైసీపీ ధర్నాలు చేయడం హాస్యాస్పదం: గన్ని

W.G: విద్యుత్  ఛార్జీల పెంపు అంటూ వైసీపీ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం భీమడోలులోని క్యాంపు కార్యాలయంలో గన్ని మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ బిల్లులు అంశంపై మాజీ సీఎం జగన్ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

December 28, 2024 / 11:23 AM IST

ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్: మంత్రి

KMM: న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి శనివారం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళి అర్పించారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన మహోన్నత వ్యక్తిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ సేవలను మంత్రి పొంగులేటి గుర్తు చేసుకున్నారు.

December 28, 2024 / 11:22 AM IST

గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ విద్యార్థి

మేడ్చల్: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి డబుల్ బెడ్ రూమ్స్ వద్ద గంజాయి విక్రయిస్తూ మణికంఠ (21) అనే హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థి పట్టుబడ్డాడు. 1. 5 కేజీల గంజాయి స్వాదీనం, పోలీసుల అదుపులో మణికంఠ ఉన్నారు. మల్లాపూర్‌లో ఉండే మణికంఠ, హోటల్ మేనేజ్ మెంట్ రెండోవ సంవత్సరం చదువుతున్నాడు.

December 28, 2024 / 11:22 AM IST

రికార్డు సృష్టించిన గన్నవరం వ్యక్తి

కృష్ణా: గన్నవరంకు చెందిన సంగిశెట్టి చిట్టిబాబు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో స్థానం సాధించారు. కంప్యూటర్‌కీ బోర్డు “A నుంచి Z’ వరకు ఉన్న ఆంగ్ల అక్షరాలను ఆల్ఫాబెట్ ఆర్డర్‌లో వెనుక నుంచి ముందుకు అత్యంత వేగంగా టైప్ చేసినందుకు గాను ఆయన ఈ ఘనతను సాధించారు. ఈ సందర్భంగా చిట్టి బాబుని గన్నవరం క్యాంప్ కార్యాలయంలో MLA యార్లగడ్డ వెంకట్రావు ఘనంగా సత్కరించారు.

December 28, 2024 / 11:22 AM IST

పోలీస్ కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రామ్

MNCL: శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణక్క నగర్‌లో శనివారం పోలీస్ కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో వాహన పత్రాలు, నంబర్ ప్లేట్లు సరిగా లేని, సైరన్ వాడే 25 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 5 కార్లు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేణుచందర్, ఎస్సైలు పాల్గొన్నారు.

December 28, 2024 / 11:20 AM IST

నీటి నాణ్యత, క్లోరిన్ శాతం పరిశీలన

E.G: రాజమండ్రిలోని పలు ప్రాంతాలలో ఉన్న ఇంటి కుళాయిలు, వాటర్ ట్యాంకులను నగరపాలక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి నాణ్యత, క్లోరిన్ పరీక్ష నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి వార్డులో ఐదు శాంపిల్స్ చొప్పున క్లోరిన్ పరీక్ష నిర్వహించి నీటి నాణ్యతను పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు.

December 28, 2024 / 11:20 AM IST

రొంపిచెర్ల మండలంలో 14.6 మి.మీ వర్షపాతం

CTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రొంపిచెర్ల మండలంలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చిత్తూరు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

December 28, 2024 / 11:20 AM IST

తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గటంలో రూ.77,840 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.71,350కి చేరింది. కాగా, కిలో వెండి ధరపై రూ.100 తగ్గటంతో రూ.99,900గా ఉంది.

December 28, 2024 / 11:20 AM IST

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి: అనిల్ జాదవ్

ADB: నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన మోగిలి లక్ష్మీకి మంజూరు అయిన రూ. 16,500 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, ప్రతాప్, మహేందర్ రెడ్డి, సోమేశ్ తదితరులు ఉన్నారు.

December 28, 2024 / 11:19 AM IST

పులివెందులలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి నిరసన

కడప: పులివెందుల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి శనివారం నిరసనకు దిగారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉంది. నన్ను అవమానించడానికే వైసీపీ కౌన్సిలర్లు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సమయానికి రాలేదు. ఈరోజు సమావేశాన్ని వాయిదా వేసి మరోరోజు నిర్వహించాలి’ అని ఎమ్మెల్సీ కమిషనర్‌ను కోరారు.

December 28, 2024 / 11:17 AM IST

మహబూబాబాద్ కోర్టు ఏజీపీగా సునీత

మహబూబాబాద్: కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సునీత నియమింపబడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గార్ల మండలం గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన తాటిపాముల సునీత లాయర్‌గా మహబూబాబాద్ కోర్టులో సుమారు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు.

December 28, 2024 / 11:17 AM IST

రేపు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

సిద్దిపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గౌడ్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

December 28, 2024 / 11:15 AM IST