కృష్ణా: గన్నవరంకు చెందిన సంగిశెట్టి చిట్టిబాబు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో స్థానం సాధించారు. కంప్యూటర్కీ బోర్డు “A నుంచి Z’ వరకు ఉన్న ఆంగ్ల అక్షరాలను ఆల్ఫాబెట్ ఆర్డర్లో వెనుక నుంచి ముందుకు అత్యంత వేగంగా టైప్ చేసినందుకు గాను ఆయన ఈ ఘనతను సాధించారు. ఈ సందర్భంగా చిట్టి బాబుని గన్నవరం క్యాంప్ కార్యాలయంలో MLA యార్లగడ్డ వెంకట్రావు ఘనంగా సత్కరించారు.