• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు నిర్మాణ పనులను పునఃప్రారంభించాలి

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలో నిలిచిన ఓవీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. త్వరితగతిన రహదారి నిర్మాణ పనులు పునఃప్రారంభించి పూర్తిచేయాలని అధికారులకు చెప్పారు. రోడ్డు నిర్మాణాన్ని పటిష్టంగా నిర్మించేందుకు కృషి చేయాలని సూచించారు.

December 28, 2024 / 10:05 AM IST

డిగ్రీలో ఇక కామన్ సిలబస్

TG: అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో కామన్ సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కొత్త సిలబస్ తయారు చేసే పనిలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బిజీగా ఉంది. దీనికోసం నాలుగు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. 2025–26 విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

December 28, 2024 / 10:04 AM IST

హైదరాబాద్ కటక్ రైలుకు కొత్తవలసలో నిలుపుదల

VZM: రానున్న సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ కటక్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. జనవరి 7,14, 21తేదీలలో హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి 8.10, బుధవారం ఉదయం 10.30 కొత్తవలసకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో తేది 8,15,22 కటక్‌లో బుధవారం రాత్రి 10.30 బయలుదేరి, కొత్తవలస మరుసటి రోజు ఉదయం 06.40 వస్తుందన్నారు.

December 28, 2024 / 10:01 AM IST

నాగార్జునసాగర్‌లో పర్యాటకుల సందడి

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పర్యాటకులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భారీగా తరలివచ్చారు. నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రం, బుద్ధవనం, కృష్ణ నదిలో లాంచి విహారయాత్ర, ఎత్తిపోతలు, వాటర్ ఫాల్ తదితర ప్రాంతాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. రేపు ఆదివారం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని టూరిజం అధికారులు చెబుతున్నారు.

December 28, 2024 / 09:59 AM IST

ఎంపీ నిధులతో పోలీసు శాఖకు వాహనాలు

KRNL: జిల్లా పోలీసు శాఖకు ఎంపీ నిధుల నుంచి రెండు బొలెరో నూతన వాహనాలను కేటాయించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎస్సీ బిందుమాధవ్‌తో కలిసి శుక్రవారం జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. రాత్రివేళల్లో జిల్లా వ్యాప్తంగా పోలీసు గస్తీని పటిష్టంగా నిర్వహించారు.

December 28, 2024 / 09:58 AM IST

శావల్యాపురంలో లారీల్లో డీజిల్ చోరీ

PLD: శావల్యాపురం మండలంలోని ఘంటవారిపాలేం అద్దంకి సాగర్ కెనాల్ వద్ద లారీలు పార్కింగ్ చేసి డ్రైవర్లు నిద్రిస్తున్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగులు నాలుగు లారీల్లో డీజిల్‌ను చోరీ చేశారు. ఉదయాన్నే డ్రైవర్లు లేచి చూసేసరికి అయిల్ చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ సంఘటనపై శావల్యాపురం ఎస్సై లోకేశ్వరావును వివరణ కోరగా తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

December 28, 2024 / 09:58 AM IST

గుండెపోటుతో బీజేపీ నేత మృతి

KMM: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాసాని సీతారాములు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. కూసుమంచి మండలం జీల్లాచెర్వు గ్రామానికి చెందిన సీతారాములు బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. వారి మృతిపట్ల జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

December 28, 2024 / 09:56 AM IST

అయ్యప్ప స్వాముల సమస్యల పరిష్కారానికి కృషి: MLA

ADB: నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామ అయ్యప్ప స్వాములు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో అయ్యప్ప సన్నిధానానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

December 28, 2024 / 09:55 AM IST

‘మన్మోహన్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు’

మాజీ ప్రధాని మన్మోహన్ స్మారకంపై కాంగ్రెస్ తీరును BJP తప్పుపట్టింది. ఈ అంశంపై మాట్లాడిన ఆ పార్టీ సీనియర్ నేత సుధాంశు త్రివేది.. ‘మన్మోహన్‌కు మెమోరియల్‌ను నిర్మిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మన్మోహన్‌ను గౌరవించలేదు. ఆయన మరణం తర్వాత కూడా రాజకీయాలు చేస్తోంది. సర్దార్ పటేల్ నుంచి PV, ప్రణబ్ వరకు పలువురు కాంగ్రెస్ నేతలకు అన్యాయమే జరిగింది’ అని అన్నారు.

December 28, 2024 / 09:55 AM IST

స్వర్ణానందమయం శ్రీ రాఘవేంద్రుడి బృందావనం

KRNL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో మూల బృందావనాన్ని స్వర్ణ కవచ అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థలు ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీ మూల రామ దేవతలకు విశేష పూజలు చేసి దూప దీప నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు.

December 28, 2024 / 09:54 AM IST

హైవేపై తృటిలో తప్పిన ప్రమాదం

KKD: జగ్గంపేట 16వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపుకు వెళుతున్న కంటైనర్ లారీ జగ్గంపేట హైవే బ్రిడ్జిపై డివైడర్ ఢీకొట్టి మరో రోడ్డుకు దూసుకువచ్చింది. అదే సమయంలో మరో భారీ వాహనం వస్తే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు.

December 28, 2024 / 09:53 AM IST

రుద్రగూడెంలో పులి.. భయాందోళనలో గ్రామస్తులు

WGL: నల్లబెల్లి మండలం రుద్రగూడెం పెద్ద తండా వద్ద మొక్కజొన్న చేనులో రైతులకు పులి దర్శనం ఇవ్వడంతో వారు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో ఘటన ప్రాంతానికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

December 28, 2024 / 09:52 AM IST

కార్మికుల సమస్య పరిష్కరించాలి: సీఐటీయూ

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. రామాయంపేటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కాస్మెటిక్స్ సరఫరా చేయాలని, ఐదు నెలల వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

December 28, 2024 / 09:50 AM IST

గన్ మిస్ ఫైర్.. రిటైర్డ్ ఉద్యోగికి గాయాలు

WG: సర్వీసు గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యాడు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంకు చెందిన మిలిటరీ ఉద్యోగి కారింకి శ్రీనివాస్ తన గన్‌ను ప్రతి 6 నెలలకోసారి నిడదవోలు సీఐ కార్యాలయంలో తనిఖీ చేయిస్తుంటారు. గురువారం నిడదవోలు పోలీస్ కార్యాలయానికి తన గన్ను చెక్ చేయించడానికి తీసుకువచ్చి గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది.

December 28, 2024 / 09:49 AM IST

దొంచందలో CMRF చెక్కుల పంపిణి

నిజామాబాద్: జిల్లా ఏర్గట్ల మండలం దొంచందకి చెందిన పెద్ది రెడ్డి నవ్యకు ఇవాళ కాంగ్రెస్ నాయకుడు జిల్లా జనరల్ సెక్రటరీ పెద్ది రెడ్డి రవి రూ. 60 వేల CMRF చెక్కును అందించారు. అనంతరం చెక్కు అందుకున్న లబ్ధిదారుడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి, లింగారెడ్డి, ఆశీరెడ్డి, నరేష్, ప్రకాష్, బీమయ్య తదితరులు పాల్గొన్నారు.

December 28, 2024 / 09:47 AM IST