కడప: ముద్దనూరు మండలంలో శనివారం నిర్వహిస్తున్న బాల ఆధార్ క్యాంపులను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీడీఓ ముకుందా రెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ బాల ఆధార్ నమోదు కోసం పిల్లల జన్మధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, చిన్న పిల్లలను తీసుకొని ఆయా కేంద్రాలలో సంప్రదించాలని సూచించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు బాల ఆధార్ నమోదు చేయించాలన్నారు.
నిజామాబాద్: బిక్కనూరు మండలం బస్వాపూర్లో అయ్యప్ప మహా పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గురుస్వామి సుధాకర్ రెడ్డి నివాసంలో పడిపూజ ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు పెద్ద ఎత్తున పడిపూజకు హాజరయ్యారు. పూజ అనంతరం అయ్యప్ప స్వాములు భక్తి గీతాలు ఆలపించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
కృష్ణా: మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ రోజు పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఎంపీ శనివారం ఉదయం 10.30 గంటలకు అవనిగడ్డలో దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మచిలీపట్నంలోని ఆర్ & బి గెస్ట్ హౌసులో పత్రికా విలేఖరులతో సమావేశంలో మాట్లాడతారని ఎంపీ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
నిజామాబాద్: రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామ బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సంస్థాగత మార్పులో భాగంగా 155వ బూత్ అధ్యక్షుడిగా లింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
NLG: చండూరు మున్సిపల్ పరిధిలోని అంగడిపేటకు చెందిన మారగోని సునీత(45) ఆనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్ సునీత మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రూ. 10,000 ఆర్థిక సాయం చేశారు. కోడి శ్రీనివాసులు, నల్లగంటి మల్లేష్, గుండూరి జనార్ధన్, కల్లెట్ల మారయ్య పాల్గొన్నారు.
మెదక్: ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గల ఎర్రమాన్‌ను కుచ్చా బుడగ జంగం సంఘ సభ్యులకు నూతన బేడా బుడగ జంగం యువజన సంఘం ఏర్పాటు ఆదివారం జరుగుతుందని పాస్తాం పరుశరామ్, పోచయ్య అనరసి, గర్ని వెంకట్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా టేకు రమేష్ మాట్లాడుతూ.. గవర్నమెంట్ నుండి వస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందేలాగా కృషి చేస్తామని, బుడగ జంగాల ఐకమత్యంతో కలిసి పనిచేయాలని చెప్పారు.
TPT: తిరుపతి వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొ.ఉమామహేశ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన విద్యార్థి వర్సిటీలో మొదటి సం.చదువుతోంది. ఆమె తరగతి గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రొ. లైంగింకంగా వేధించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలకు ఈనెల 28 నుంచి 31 వరకు అంతరాయం కలుగుతుందని బ్యాంక్ రీజనల్ మేనేజర్ చిరంజీవి వెంకటేశ్ తెలిపారు. బ్యాంక్ వ్యవస్థను ఏపీ, తెలంగాణ శాఖలుగా విభజించే ప్రక్రియలో భాగంగా నగదు లావాదేవిలతోపాటు అన్ని సేవలు నిలిచిపోతాయని వెల్లడించారు. జనవరి 1 నుంచి యథావిధిగా బ్యాంక్ సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
SRPT: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకును జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నందున నేటి (శనివారం) నుంచి ఈనెల 31 వరకు బ్యాంకింగ్ సేవలు నిలిపివేయనున్నట్లు జిల్లా కేంద్రంలోని సూర్యాపేట శాఖ ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ అజయ్ ఆనంద్ తెలిపారు. బ్రాంచ్‌ల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు.
NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో శనివారం ‘రెవెన్యూ సదస్సు’ నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పి.అనిల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. హనుమాన్ గుడి ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకుంటామని చెప్పారు. భూ యజమానులు ఏమైనా సమస్యలుంటే రెవెన్యూ సదస్సులో పరిష్కరించుకోవచ్చని తహసీల్దార్ సూచించారు.
కామారెడ్డి: ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నేడు 15 విడత ఉపాధిహామీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు MPDO ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధిహామీ పనులకు సంబంధించిన సోషల్ ఆడిట్ బృందంచే సామాజిక తనిఖీ వారం రోజులపాటు నిర్వహించగా తుది నివేదిక సందర్భంగా నేడు ప్రజా వేదిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో రహదారిపై గత కొద్దిరోజులుగా అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు అంటున్నారు. రోడ్డు పక్కనున్న మురుగు.. డ్రైనేజీలా పొంగి రహదారిపైకి వస్తుండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారి రోగాలు వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరారు.
ADB: తాంసి మత్తడి వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 25 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరినట్లు JE హరీశ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 అడుగులు కాగా, ప్రస్తుతం 272.10 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 25 క్యూసెక్కులుగా ఉందన్నారు.
సంగారెడ్డి: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 30న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సదాశివపేటలోని సిద్దాపూర్ రోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బంగ్లా భారతి తెలిపారు. 10 కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఎస్సీ నుండి బీటెక్ చదివిన వారు అర్హులన్నారు. ఉండాలన్నారు.
కృష్ణా: నూజివీడు పట్టణంలోని సమతానగర్‌లో జరిగిన చోరీ ఘటనలో ఆధారాల సేకరణ కోసం ఏలూరు నుంచి శుక్రవారం క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం సభ్యులు ఇంట్లో ఆధారాల కోసం అణువణువూ గాలించి వేలిముద్రలు సేకరించారు. చోరీ జరిగిన ఇంట్లోని బీరువాలు, తలుపులు తదితర వాటిపై వేలిముద్రల కోసం క్లూస్ టీం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు.