WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన నక్క తిరుపతయ్య రెండు నెలల క్రితం ద్విచక్ర వాహనంపై నుండి కింద పడి కాలు విరగడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. శుక్రవారం సీఎం సహాయ నిధి రూ.60 వేలు చెక్కును గ్రామ కాంగ్రెస్ నేతలు బాధితుడికి శుక్రవారం రాత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
PPM: గిరిజన గురుకుల ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు బంకురు జోగినాయుడు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 15-20 సంవత్సరాలు నుండి పనిచేస్తున్న వారిని రోడ్డును పడేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NTR: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. సీఐ కొండలరావు తెలిపిన సమాచారం మేరకు.. చిట్టినగర్‌కు చెందిన ఓ మైనర్ బాలిక (14)ను వించిపేటకు చెందిన చెన్నా రవీంద్ర అనే యువకుడు మాయమాటలు చెప్పి ఈ నెల 26న అత్యాచారం చేసినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
HYD: చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం శుక్రవారం తెలిపింది. ఈ టెర్మినల్‌ను శనివారం రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ ప్రారంభించాల్సి ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతితో ఈ కార్యక్రమం వాయిదా పడింది.
SKLM: పలాస గోదావరి పురం గ్రామంలో జె.శంకర్‌ను 46 సారా ప్యాకెట్లతో శుక్రవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ అధికారి కె.మల్లికార్జునరావు తెలిపారు. గ్రామంలో సారా అమ్ముతున్నట్లు ఖచ్చితమైన సమాచారం మేరకు పట్టుకున్నామని తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
HYD: న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. 31st నైట్ ఈవెంట్ల పై ప్రత్యేక నిఘా పెట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలు వినియోగించవద్దని హెచ్చరిస్తున్నారు. OYO హోటల్స్, ఫాం హౌజ్‌లో శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు.
WNP: ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 154 అర్జీలు స్వీకరించినట్లు మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. సెలవు రోజు అయినా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అర్జీలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ప్రజల ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి సమీపంలోని నగర పాలక సంస్థ మైదానంలో అష్టలక్ష్మి సహిత పుష్పయాగ సహిత కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయ గణపతి ఆలయం అర్చకులు పెంటశ్రీధర్ శర్మ, విజయదుర్గాదేవి ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణశర్మ తెలిపారు. ఈనెల 29వ తేదీన కోటి దీపోత్సవం, శ్రీనివాస బంగారయ్యశర్మ ప్రవచనం ఉంటుందని వారు పేర్కొన్నారు.
SBI ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో మొత్తం 600 పోస్టులు భర్తీ చేయబడతాయి. వీటిలో 586 రెగ్యులర్, 14 బ్యాగ్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష అధికారులు వచ్చే ఏడాది మార్చి 8, 15 తేదీలలో నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కాగా.. జనవరి 16వ తేదీ నాటికి ముగియనుంది.
SKLM: వజ్రపుకొత్తూరు మండలం పలాస నియోజకవర్గ పరిధిలోని గ్రిగ్స్ మీటను ఈనెల 30, 31న గోవిందపురం ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు కె.హరిబాబు, వ్యాయామోపాధ్యా యుడు నాగరాజు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గంలోనే ఉన్న క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి ఈ పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాఠశాల అనుమతి తప్పనిసరి అన్నారు.
NGKL: వెల్దండ మండల కేంద్రం నుంచి రాచూరు గ్రామానికి బీటీ రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారని మండల బీజేవైఎం ఉపాధ్యక్షుడు సురేశ్ రెడ్డి శుక్రవారం అన్నారు. మండలంలో అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు ఉన్న.. రాచూరు గ్రామానికి బీటీ రోడ్డు లేకపోవడం బాధాకరమన్నారు. అధికారులు స్పందించి రాచూరు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు.
SKLM: గత ప్రభుత్వం సమయంలో పాలకులు చేసిన పాపాలు ఏపీ రాష్ట్రానికి శాపాలు గా మారాయి అని కలమట TDP పార్లమెంట్ అధ్యక్షులు కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. శుక్రవారం కొత్తూరు లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సిఎం జగన్ 2019-24 మధ్య ఐదేళ్ల అవగానలేని పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు.
HYD: ఇంటి నుంచి పని కోసం బయటికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన జవహర్‌నగర్ PS పరిధిలో జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. BJR నగర్‌లో పార్వతమ్మ కుమార్తె భానుప్రియ(18) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే బుధవారం ఉదయం పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
HYD: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని బాలనగర్ ఇన్‌స్పెక్టర్ నరసింహరాజు అన్నారు. శుక్రవారం రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి గిరినగర్ పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు తమకు సహకరించాలని, ఒక్క సీసీ కెమెరా నిఘా వేయి కళ్లతో సమానమని పేర్కొన్నారు.