WNP: పెబ్బేరు PHC లో 102 సేవలను శుక్రవారం జిల్లా 102 సేవల అధికారి రత్నమయ్య తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర అమ్మఒడి సేవలు రాత్రి కాల సమయంలో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. గర్భిణులను నెలవారి పరీక్షల కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లే అమ్మఒడి వాహనాల సేవలను అంతరాయం లేకుండా నిరంతరం 24 గంటలు సేవలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
SKLM: పోలాకి, ప్రియాగ్రహారం, కోడూరు లో APGVB బ్యాంక్ సేవలకు ఈనెల 28 నుంచి 31 వ తేదీ వరకూ అంతరాయం కలుగుతుందని పోలాకి ఏపీజీవీబీ మేనేజర్ సూర్యనారాయణ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పరిధిలో ఉన్న బ్యాంకును విభజించనున్న నేపథ్యంలో 31 వరకూ బ్యాంక్ లావాదేవీలు ఏటీఎం,లు, UPI, సేవలు పనిచేయవు అని పేర్కొన్నారు.
HYD: రైల్వే ట్రాక్ సమీపంలో శిశువును వదిలివెళ్లిన ఘటన ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మారుతీ నగర్‌లోని భూలక్ష్మమ్మ దేవాలయం సమీపంలోని చెత్తకుప్పలో శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శిశువును పోలీసులు కాపాడి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
SRPT: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించే సమావేశానికి పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య కోరారు. శుక్రవారం కోదాడ యూనిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సకాలంలో సంఘం సభ్యులందరూ హాజరు కావాలని కోరారు.
HYD: ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ (25) అమీర్‌పేట్‌లో టెక్నికల్లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం అవుషాపూర్ సమీపంలో షిర్డీ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
WNP: చెరుకు పంట సాగు గిట్టుబాటు కాక జిల్లా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తకోట, మదనాపురం, చిన్నచింతకుంట, అమరచింత, ఆత్మకూరు మండలాలలో సుమారు 1000 మందికి పైగా రైతులు చెరకు సాగు చేస్తున్నారు. చెరుకును రామకృష్ణాపూర్ షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. అమరచింత రైతులు మాట్లాడుతూ.. ఎకరాకు 50 టన్నుల చెరకు దిగుబడి వస్తే లాభమని, 25 నుంచి 30 టన్నులే వస్తుందన్నారు.
SKLM: కవిటి ప్రభుత్వ పాఠశాలలో పరీక్షా పే చర్చా కార్యక్రమంపై ఎంఈఓ ధనుంజయ్ అవగాహన కల్పించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం పరీక్షా పే చర్చతో లభిస్తుందని ధనుంజయ్ అన్నారు. బోర్డు, ప్రవేశ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
SKLM: కవిటి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం వీరబాల దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిక్కుల గురువు గురుగోవింద సింగ్ కుమారులు పతేసింగ్, జోరవర్ సింగ్ చిత్రపటాలకు పాఠశాల హెచ్ఎం అనిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పతే సింగ్ (5), జోరవర్ సింగ్(7) చిన్నతనంలోనే దేశం, ధర్మం కోసం ప్రాణాలర్పించారని హెచ్ఎం అనిల్ అన్నారు.
MBNR: సిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్య సమితి సభ్యురాలుగా సౌమ్య జడ్చర్ల శాఖ నుంచి శుక్రవారం ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్య సమితి సభ్యురాలుగా నియమించినందుకు ఏబీవీపీ తెలంగాణ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తానని తెలిపారు.
MBNR: మహిళలు అంటే అబల కాదు సబల అని నిరూపించాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ హాస్టల్స్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికలు (సి) హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
NLG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో NLG పట్టణంలో నిర్వహించే నేటి కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలన్నింటిని వాయిదా వేయడం జరిగిందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు గమనించాలని కోరారు.
JGL: మల్యాల క్రాస్ రోడ్‌కి వెళ్లే బ్రిడ్జి వద్ద ఇసుక ప్రమాదకరంగా మారింది. ఇసుకతో పాటుగా, అక్కడ మూలమలుపు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక వల్ల రాత్రి పూట వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు చర్య తీసుకొని ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరారు.
కోనసీమ: అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో బీచ్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శుక్రవారం జరిగిన వాలీబాల్ మ్యాచ్‌లో మొదటి ఆటగా గోవా, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడ్డాయి. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది. విద్యుత్ ద్వీపాల వెలుగులలో పోటీలు జరుగుతున్నాయి.
KKD: పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో చేరాలనుకునేవారికి జనవరి 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సనపల సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. పరీక్షలకు ఉమ్మడి జిల్లా నుంచి 8,971 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 37కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
KNR: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ బొమ్మకల్‌లో ఎల్‌పిఎల్ లీగ్ పోటీల ముగింపు సమావేశంలో అయన పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోపీలను, నగదును ఆయన అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు.