NLR: వేదయపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నట్లు స్థానికులు వాపోయారు. స్థానికంగా ఉన్న ఓ వీధిలో ఎప్పటి నుంచో చెత్త పేరుకొని పోయి ఉంది. ఆ దారిలో నడిచే పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దోమల బెడద ఎక్కువా ఉందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తొలగించాలని కోరారు.
NLR: దివంగత మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా ఆయనకు సంతాపంగా రావి చెట్టు ఆకుపై ఆయన చిత్రాన్ని విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన ఇతనికి పలు ముఖ్యమైన సందర్భాలలో పలువురి ప్రముఖుల చిత్రాలను వివిధ రకాల ఆకులపై గీసే అలవాటు ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపంగా రావి ఆకుపై వారి చిత్రం గీశారు.
W.G: జిల్లా భీమవరం ఎస్‌సీహెచ్ బీఆర్ఎం హైస్కూల్లో శనివారం నుంచి రెండు రోజుల పాటు బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు పట్టాభి రామయ్య, ఇందుకూరి ప్రసాద్ రాజు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ.. బాలోత్సవాలు పిల్లలో సృజనాత్మకతను వెలికి తీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగ సాయి, జేమ్స్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విజయనగరం పట్టణంలో రోడ్లు ఆక్రమించి వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్పోరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య హెచ్చరించారు. పట్టణంలోని ట్యాంకు బండ్, కన్యకపరమేశ్వరి, ఎన్‌సీఎస్ ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. ఫుట్ పాత్ రోడ్లను అక్రమించి వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిరు వ్యాపారులను హెచ్చరించారు.
కడప: గాలివీడు ఎంపీడీఓపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బుక్కే విశ్వనాథ్ నాయక్ చిన్నమండెంలో డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడులు నేడు కూటమి ప్రభుత్వ పాలనలో పునరావృతం కావడం సిగ్గుచేటు అని అన్నారు.
NLR: వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉండటం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని వారు నిర్ణయించారు.
ATP: కూడేరు సచివాలయం వద్ద నేడు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కృష్ణా: జగన్ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ ఛార్జీలు పెరిగాయని, ఆయన తుగ్లక్ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నందిగామ MLA తంగిరాల సౌమ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీల పెంపు భారం ముమ్మాటికీ గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితమేనని అన్నారు. తన పార్టీ ఉనికి కోసం జగన్ సరికొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు.
ADB: జైనూర్ మండలంలోని లెండిగూడ గ్రామంలోని ప్రజలకు శుక్రవారం ఎఫ్ఆర్ఓ మజారుద్దీన్ అటవీ సంరక్షణపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశానుసారం మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అటవీ చట్టాలు, అటవీ సంరక్షణపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రజలు అడవులు కాపాడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
CTR: గుంతకల్ ఏరియా ఆసుపత్రి పరిపాలన అధికారి రామ్ ప్రసాద్ రావుపై ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఆసుపత్రుల కో ఆర్డినేటర్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా మడకశిర ఏరియా ఆసుపత్రి RMO దివాకర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పీఎంపీలను గ్రామీణ వైద్యులుగా గుర్తించాలని ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62వ వార్షికోత్సవ సభలో పలువురు వక్తలు ఉద్ఘాటించారు. శుక్రవారం తాడేపల్లి గూడెం తాళ్ల ముదునూరుపాడు పీఎంపీల అసోసియేషన్ భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎఆర్‌కే పరమేశ్వరులు అధ్యక్షత వహించారు.
NLR: వేదాయపాలెంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న మండల పూజా మహోత్సవంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన నగరోత్సవం కనులవిందు చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షులు జీ శేషగిరిరావు నేతృత్వంలో జరిగిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి మొదలైన ఈ ఉత్సవం నవాబుపేట శివాలయం అందరు ప్రాంతాల్లో వైభవంగా జరిగింది.
కడప: విద్యార్థుల ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాన్ని శుక్రవారం వైవియూలో వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనేజ్‌మెంట్ నిర్వహణతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నవారు దేశ విదేశాల్లో రాణిస్తారన్నారు. పరిశ్రమలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా వాస్తవ స్థితిగతులతో జ్ఞానం వృద్ధి చెందుతుందన్నారు.
E.G: గోకవరం మండల ప్రాంతంలో ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు సంచరించినట్లు కనిపిస్తే, ఆటోల్లో ప్రయాణిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై పవన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆటో డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటోల్లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు ఆటో ఎక్కితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
NTR: విజయవాడ నగరంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై, పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌ల విషయాలు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని 2,392 మంది వ్యక్తుల వద్ద నుంచి రూ. 9,50,725 రుసుము వసూలు చేశామన్నారు.