కడప: పులివెందుల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ హాలులో శనివారం ఉదయం కౌన్సిల్ సాధారణ సమావేశం, బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నట్లు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాముడు తెలిపారు. ఈ సమావేశంలో ప్రజల సమస్యలతోపాటు, బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయన్నారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తప్పక హాజరు కావాలని సూచించారు.
E.G: విద్యుత్ ఛార్జిల పెంపు నిరసిస్తూ వైసీపీ చేపట్టిన పోరుబాటపై అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ చార్జీలు పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయమని జగన్ పిలుపునివ్వడం తుగ్లక్ చర్యలాంటిదన్నారు. తాను పెంచిన ఛార్జిల మీద తన నాయకుల చేతనే ధర్నా చేయించుకోవడం అనేది విచిత్రమైన పరిస్థితి అని ఎద్దేవా చేశారు.
KRNL: ఎమ్మిగనూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ పోలీసులు కల్లుదేవకుంట చెక్పోస్ట్ సమీపంలోని చెట్నేపల్లి క్రాస్ రోడ్ వద్ద జరిపిన దాడుల్లో గోనెగండ్ల, మండలం పెద్దమర్రివీడు చెందిన కమ్మడి పాపయ్య (39) ద్విచక్ర వాహనంపై అక్రమ కర్ణాటక మద్యం రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగిందని, ఎక్సైజ్ ఎస్సై ఇస్మాయిల్ తెలిపారు.
ATP: తాడిపత్రి పట్టణంలో నాలుగు రోజులపాటు క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. క్రీడా పోటీల్లో పట్టణానికి చెందిన 9వ తరగతి విద్యార్థి మానస అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 200మీ పరుగు పందెంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. ప్రతిభ చాటిన విద్యార్థి మానసను ప్రిన్సిపల్ అమర్నాథ్, వ్యామాయ ఉపాధ్యాయులు దాదు, శివలు అభినందించారు.
PLD: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద (APSSDC) ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలోని ఎస్స్కే బీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాకు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 4 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. 34 మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరవ్వగా అందులో 18 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
ATP: జిల్లాలో ఈ నెల 31న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జేసీ శివ్ నారాయణ శర్మ తెలిపారు. లబ్ధిదారులు అందరూ ప్రతినెలలాగే ఇంటి వద్దే పింఛన్ సొమ్ము పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో 2,53,489 మందికి మొదటి రోజే పంపిణీ చేస్తామని.. సాంకేతిక సమస్యతో ఆగితే జనవరి 2న ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
KRNL: ఎమ్మిగనూరులో జరిగే 23వ కర్నూలు జిల్లా మహాసభలను ఈ నెల 29, 30 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, రాధాకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు హనుమంతు పిలుపునిచ్చారు. శుక్రవారం చైర్ బజార్లో సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఉపాధి, త్రాగు, సాగు నీరు లేక, ప్రజలు వలస బాట కొనసాగించారు.
KDP: జమ్మలమడుగు ఎన్జీవో కార్యాలయంలో శుక్రవారం సీపీఎం నాయకులు జనవరి 4,5 తేదీలలో సీపీఎం జిల్లా 12వ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి జేసుదాసు మాట్లాడుతూ.. కడపలో జరుగనున్న సభలకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం, ఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ప్రభాకర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.
PLD: మాచర్ల మండల పరిధిలోని కొప్పునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కిషోర బాల బాలికలకు బాల్య వివాహాల గురించి అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పాఠశాల అధ్యాపకులు ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో కలిసి 13 నుంచి 16 సంవత్సరాల బాలబాలికలకు బాలవికాసం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
KMM: పల్లెగూడెం-మంగళగూడెం బీటీ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాగే గోళ్ళపాడు- తీర్థాల, పల్లెగూడెం – గోళ్ళపాడు మార్గంలో ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదన్నారు. R&B అధికారులు, పొంగులేటి దృష్టి సారించి పనులు పూర్తి చేయలన్నారు.
నిజామాబాద్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్సాపల్లిలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతిచెందారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్సాపల్లి నుంచి మిర్దాపల్లికి ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఓ మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
NLG: శాంతి భద్రతల విషయంలో పోలీసులు రాజీ పడొద్దు అని DSP శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. అక్రమ ఇసుక రవాణాను నివారించాలని, ఫిర్యాదు దారుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CI కొండల్ రెడ్డి, SI సైదులు, తదితరులు పాల్గొన్నారు.
ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 18రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల BJP జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రఘునాథ్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినా రెగ్యులరైజ్ చేయలేదన్నారు.
W.G: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండి మండలం యండగండి డెడ్ బాడీ పార్శిల్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు, ముద్దాయిలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి. శ్రీవేదను శుక్రవారం జిల్లా ఎస్పీ నయీం ఆస్మి అభినందించారు. ఆయన చేతుల మీదుగా అభినందన జ్ఞాపికను డీఎస్పీ శ్రీవేద అందుకున్నారు.
PDPL: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మల్హర్ రావు మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్‌ను కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. కార్యాలయంలోని పలు రికార్డులను డీఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చే వారి పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.