KMM: ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో వారాంతపు సెలవులు కాగా, 30వ తేదీన అమావాస్య సందర్భంగా సెలవులు ప్రకటించడం జరిగిందని చెప్పారు. తిరిగి ఈనెల 31 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు.
BPT: అమృతలూరు నుండి చెరుకుపల్లి, తెనాలి వెళ్ళే రోడ్డు పూర్తిగా పాడైపోయింది. కొన్ని చోట్ల రోడ్డు మధ్యకు బద్దలుగా పగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ సమస్యను కూటమి ప్రభుత్వ హయాంలోనైనా రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
కామారెడ్డి: జహీరాబాద్ పట్టణానికి చెందిన చిద్రి ఉమా హనుమాన్ గుప్తా కుమార్తె చిద్రి లిఖిత CA తుది ఫలితాలలో జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది. శుక్రవారం MLA క్యాంపు కార్యాలయంలో లిఖితను MLA మాణిక్ రావు సన్మానించి అభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జహీరాబాద్‌కు గర్వకారణమని MLA అన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
ATP: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని జేసీ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 57వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి, యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు.
PLD: నరసరావుపేట మండలం గురవాయపాలెం ఎస్సీ కాలనీలో భార్యను చంపి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భర్త నమ్మించే ప్రయత్నం చేసిన ఉదంతం శుక్రవారం జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. భార్యపై అనుమానంతో భర్త రమేష్ కొట్టి చంపాడని, అనంతరం నైలాన్ తాడుతో ఉరి వేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సత్యసాయి: జిల్లాలో ఎస్సీ కుల గణనపై జనవరి 10వ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతోందని శుక్రవారం జిల్లా కలెక్టర్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ జనాభా, వారి వివరాలు, పేరు, ఆధార్ నంబరు, పుట్టిన తేదీ, మరుగుదొడ్డి సౌకర్యం, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం, ఇతర వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నారని తెలిపారు.
KDP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం కడపకు రానున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శిస్తారు. మరోవైపు ఈ దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
SRD: ఆందోలు మండలం అన్నాసాగర్ 133 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల కారణంగా ఈనెల 28న విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. జోగిపేట, చిట్కుల్, గడి పెద్దాపూర్, డాకూర్, లక్ష్మీసాగర్ గ్రామాల పరిధిలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.
GNTR: పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ శుక్రవారం తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ పరీక్ష(PMT) ఉంటుందన్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను(PET) పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 30వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
AP: బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు వివరాలను తమ ముందు ఉంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా.. హలోగ్రామ్ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని వాసుదేవరెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
AP: మాజీ MLA ద్వారంపూడి చంద్రశేఖర్‌కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీరభద్ర రొయ్యల ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉత్పత్తి నిలిపివేత ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు తెలిపింది. వ్యర్ధాలను శుద్ధి చేయకుండా పంటకాలువలోకి విడుదల చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలిచ్చింది. విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.
హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 8 టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకెళ్లింది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షో ఫైనల్ రోజున అర్బన్ ఏరియాలో 10.14, అర్బన్‌లో 12.93 టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకుంది. కాగా బిగ్ బాస్ సీజన్ 8లో విన్నర్‌గా నిఖిల్ నిలిచి టైటిల్ గెలుచుకోగా.. రన్నరప్‌గా గౌతమ్ నిలిచాడు.
AP: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవోపై దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. రేపు పవన్ కళ్యాణ్ కడప వెళ్లనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవోను పవన్ పరామర్శించనున్నారు. కాగా, కడప రిమ్స్ ఆస్పత్రిలో గాలివీడు ఎంపీడీవో చికిత్స పొందుతున్నారు.
జపనీస్ అమ్మాయిలు చూడడానికి బుట్టబొమ్మల్లా కనిపిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు కూడా. అయితే వాళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి గ్రీన్ టీ ప్రిఫర్ చేస్తారట. అలాగే జపనీయులు ఎక్కువగా పులియబెట్టిన ఆహారం తీసుకుంటారట. సీ ఫుడ్ జపనీస్ వంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువ మోతాదుల్లో తింటారు. ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. అందుకే అమ్మాయిలు స్లిమ్‌గా ఉంటారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కశ్మీరీ గేట్ సమీపంలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో రేపు మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయనున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం కాగా ఉదయం 11:45 గంటలకు మతపరమైన కార్యక్రమాలు చేపట్టనున్నారు.