శివసేన పార్టీ(shiv Sena), గుర్తు (symbol) విషయమై ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) గ్రూపు భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా షాక్ తగిలింది. శివసేన, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఉద్ధవ్ థాక్రే. అయితే ఈ కేసు ఆర్...
Meghalaya bjp chief controversy comments:మేఘాలయా బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను గొడ్డు మాంసం తింటానని పేర్కొన్నారు. బీఫ్ తినడంపై తమ పార్టీలో నిషేధం ఏమీ లేదని అగ్నికి ఆజ్యం పోశారు. కులం, మతం, వర్గం అని బీజేపీ చూడదని అన్నారు. తాను బీఫ్ తినడం వల్ల బీజేపీకి ఎలాంటి సమస్య లేదని చెప్పారు.
మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్( Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో బార్లను మూసేయనున్నట్లు తెలిపింది. వైన్స్ షాపు ( Whines shop) లో మద్యం అమ్మకాలు మాత్రమే జరుగుతాయని అక్కడ కుర్చుని తాగేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.
balloon landed in farmers field:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో కూడా పెద్ద బెలూన్ కలకలం రేపింది. వ్యవసాయ పొలాల పక్కనే గల మామిడి తోటలో పడింది. దీంతో అక్కడ ఉన్న రైతులు, రైతు కూలీలు భయాందోళనకు గురయ్యారు.
Amitabh : బిగ్ బీ అమితాబచ్చన్ బంధువుకి ఓ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. కాగా... ఈ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు.. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఆలయ పున:నిర్మాణం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పాలక మండలి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం వారాంతాల్లో భక్తులు భారీగా వస్తున్నారు. ఇక ఉత్సవాలకు ఆలయం కిటకిటలాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది.
పోసాని (Posani) కృష్ణమురళి.. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా(Director), నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. నటుడిగా తనదైన మార్క్ చూపించినవారాయన. తాజా ఇంటర్వ్యూ(Interview)లో మాట్లాడుతూ ఆయన తన తల్లిదండ్రులను గురించి ప్రస్తావించారు. "మా నాన్న చాలా మంచివాడు ... చూడటానికి గుమ్మడిగారిలా ఉండేవాడు. ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు ఉండేవి కాదు. కానీ కొంతమంది ఆయనకి పేకాట అలవాటు...
బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం కన్నుమూసిన నందమూరి తారకరత్న మృత దేహాన్ని నిన్న హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు. నేడు ఉదయం.. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు.
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) (CCL) దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఘనంగా మొదలైంది. రాయ్‌పుర్ (Rayapur) వేదికగా తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అక్కినేని అఖిల్ అదరగొట్టాడు. 30 బంతుల్లో 91 పరుగులు చేసి అబ్బురపరిచాడు. దీంతో తెలుగు వారియర్స్ జట్టు 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దేశ రాజధాని ఢిల్లీలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇంటిపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అసదుద్దీన్. న్యూఢిల్లీలోని అశోకా రోడ్ ప్రాంతంలోని ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు, రాళ్లు విసిరి కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఢిల్లీలోని ఆయన నివాసం పై ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి.
KTR Tweet : ఆసిస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. మొత్తం నాలుగు టెస్టుల సీరిస్‌లో ఇప్పటికే ఇండియా రెండు టెస్ట్ మ్యాచ్‌లను సొంతం చేసుకున్నది. మొదటి టెస్ట్ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించగా రెండో టెస్ట్ మ్యాచ్‌ను సైతం టీమిండియా మూడు రోజుల్లోనే కైవసం చేసుకోవడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీ రోల్ ప్లే చేయగా, విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ...
సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కీలక ప్రకటన చేసింది. నగరంలో మూడు రోజుల పాటు 33 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా మూడు రోజులపాటు పలు ట్రైన్ (Train) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ సింబల్ విషయంలో తమకు ఏం జరిగిందో అన్ని పార్టీలు చుసాయని, ఇప్పటికైనా బీజేపీతో కలవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం అసలైన శివసేన గా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ వర్గానికి పార్టీ సింబల్ విల్లు - బాణం గుర్తును కేటాయించింది