• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘క్రీడా పోటీలను దిగ్విజయం చేసిన అందరికీ కృతజ్ఞతలు’

SRD: పటాన్ చెరువు మైత్రి గ్రౌండ్‌లో 69వ రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను దిగ్విజయంగా నిర్వహించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు పట్లోళ్ల హనుమంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గిరి గోస్వాములు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ..  ఈ పోటీలో 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు,1500 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొ...

October 20, 2025 / 04:38 PM IST

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న సీపీ

SDPT: కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని సిద్దిపేట CP విజయ్ కుమార్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద విద్యార్థులతో ఆశీర్వచనం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో AEO బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, చేర్యాల CI శ్రీనివాస్ పాల్గొన్నారు.

October 20, 2025 / 04:38 PM IST

‘బలరాం మృతి వారి కుటుంబానికి తీరని లోటు’

NLG: కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన పోలగోని బలరాం సోమవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కేతేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

October 20, 2025 / 04:37 PM IST

కొత్త పదవిలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి: ఛైర్మన్

SDPT: జిల్లా నూతన పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సిద్దిపేటలోని కమిషనర్ కార్యాలయంలో కలిశారు. కమిషనర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. విజయ్ కుమార్ తన కొత్త పదవిలో ప్రజలకు మరింతగా సేవలు అందించాలన్నారు.

October 20, 2025 / 04:32 PM IST

సింహాచల స్వామివారి అన్నప్రసాదానికి విరాళం

VSP: వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం సింహాచలంలో నిత్య అన్నప్రసాదం పథకానికి హైదరాబాద్‌కు చెందిన వై. మహేష్, శ్రీమతి గాయత్రి దంపతులు రూ.1,01,116 చెక్కు రూపంలో సోమవారం విరాళం అందించారు. ఆలయ సహాయకార్య నిర్వహణ అధికారి కే. తిరుమలేశ్వరరావు దానాన్ని స్వీకరించారు. దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం, వేద ఆశీర్వచనం కల్పించి, శేష వస్త్రాలతో సత్కరించారు.

October 20, 2025 / 04:31 PM IST

హత్యకు గల కారణాలు వెల్లడించిన పోలీసులు

ATP: డి.హీరేహళ్‌ మండలం మురడిలో నాగవేణి(35)ని భర్త హనుమంతరాయుడు చంపిన విషయం తెలిసిందే. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల నుంచి హనుమంతరాయుడు మానసికంగా బాధపడేవాడని, ఈ క్రమంలో కోపోద్రిక్తుడై సోమవారం ఉదయం నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో నరికి చంపినట్లు వెల్లడించారు.

October 20, 2025 / 04:30 PM IST

బుచ్చి రేబాల కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు

NLR: బుచ్చి నగర పంచాయతీ పరిధిలోని రేబాల కాలువలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ కారణంగా ప్రజలు అంటురోగాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

October 20, 2025 / 04:30 PM IST

పాలమూరులో ప్రమిదల ధరలకు రెక్కలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ప్రమిదల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కో ప్రమిద దాదాపు 20 రూపాయల ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు ఒక్కొక్కటిగా కాకుండా డజనులు లెక్కన రెండు మూడు వందల రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సందర్భంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పదు కాబట్టి ప్రమిదలనుకుంటున్నారు.

October 20, 2025 / 04:29 PM IST

నన్ను మేకలా బలి ఇచ్చారు: జీవన్ రెడ్డి

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మానసికంగా హింసకి గురికావడానికి మంత్రి శ్రీధర్ బాబు కారణమని తెలిపారు. తనను మేకలా బలి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ పదవులూ అవసరం లేదని.. కార్యకర్తల హక్కులను కాపాడుకుంటానని స్పష్టం చేశారు.

October 20, 2025 / 04:27 PM IST

‘తెలుసు కదా’ లేటెస్ట్ కలెక్షన్స్

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డతో నీరజ కోన తెరకెక్కించిన ‘తెలుసు కదా’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రూ.14.1 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు వెల్లడించారు. ఇక ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు.

October 20, 2025 / 04:27 PM IST

లింగవరంలో ఇంటిపై పడ్డ పిడుగు.. సామగ్రి దగ్ధం

TPT: చిల్లకూరు మండలంలోని రాజేశ్వరమ్మ ఇల్లు సోమవారం పిడుగుపాటుకు గురై ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. బాధిత కుటుంబానికి తక్షణసాయం అందించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

October 20, 2025 / 04:26 PM IST

జ్వాలా నారసింహుడి దర్శనానికి ఘాట్ రోడ్డు సమయాలు ఇవే..!

GNTR: అమావాస్య సందర్భంగా, మంగళగిరి జ్వాలా నారసింహుడి దర్శనం కోసం ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి సమయాన్ని దేవస్థానం ఈవో సునీల్ కుమార్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులను ఘాట్ రోడ్డులో అనుమతిస్తామని సోమవారం తెలిపారు. భక్తులు ఈ సమయాన్ని పాటించి, సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు.

October 20, 2025 / 04:25 PM IST

ప్రభాస్ కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు హను రాఘవపూడి పీరియాడికల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ నెల 22న ఈ సినిమా నుంచి అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. దానికి ‘ఒక బెటాలియన్ మీదపడిపోతే ఇలానే ఉంటది’ అని క్యాప్షన్ ఇచ్చారు.

October 20, 2025 / 04:21 PM IST

అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేసిన అధికారులు

BDK: బూర్గంపాడు మండలంలోని తాళ్లగుమ్మూరు శివారు ప్రాంతంలో సోమవారం భారీగా నిల్వ ఉంచిన అక్రమ ఇసుక డంప్లను రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బ్యాచింగ్ ప్లాంట్ వద్ద అక్రమార్కులు భారీగా ఇసుకను నిల్వ ఉంచారు. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు.

October 20, 2025 / 04:21 PM IST

రావులపాలెంలో కనువిందు చేసిన తెల్లటి మేఘాలు

కోనసీమ: రావులపాలెం జొన్నాడ బ్రిడ్జిపై సోమవారం మధ్యాహ్నం ఆకాశంలో మేఘాలు కనువిందు చేశాయి. తెల్లని మేఘాలు, నీలిరంగు ఆకాశానికి భూమికి మధ్యలో పయనిస్తూ కనిపించడంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులు వీటిని ఆసక్తిగా తిలకించారు. మేఘాలను తమ ఫోన్ లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

October 20, 2025 / 04:16 PM IST