• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

VZM: రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జరగనుంది. స్మృతి వనంలో ఉదయం 7.45 గంటలకు జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో “స్మృతి పరేడ్” నిర్వహించనున్నట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరుల త్యాగాలను కొనియాడి, నివాళులు అర్పించనున్నారు.

October 20, 2025 / 05:02 PM IST

శ్రీ చింతల వెంకటరమణ స్వామి విగ్రహం ఊరేగింపు

ATP: దీపావళి సందర్భంగా సోమవారం తాడిపత్రిలోని శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ ఆనంద వల్లి సమేత శ్రీ చింతల వెంకటరమణస్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు మురళీ అయ్యంగార్ అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పల్లకీలో ఉంచి పురవీధులలో ఊరేగింపు ఉత్సవం చేపట్టారు.

October 20, 2025 / 05:00 PM IST

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

KKD: ఆన్ లైన్ మోసాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని కోటనందూరు ఎస్సై రామక్రిష్ణ హెచ్చరించారు. సోమవారం కే.ఏ. మల్లవరంలో డ్వాక్రా మహిళలకు ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. చిట్టీలు, వ్యక్తిగత అప్పులు, అధిక వడ్డీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోకూడదన్నారు.

October 20, 2025 / 04:55 PM IST

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న పీఠాధిపతులు

MLG: తాడ్వాయి మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని ఆదివారం సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు సిద్దేశ్వర స్వామి మాట్లాడుతూ.. తల్లులకు ఆదివాసి సాంప్రదాయా ప్రకారం ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.

October 20, 2025 / 04:53 PM IST

దీపావళి ప్రమిదల వ్యాపారం జోరు

GDWL: దీపావళి పండుగ సమీపిస్తుండటంతో గద్వాల జిల్లా కేంద్రంలో ప్రమిదల (దీపాల) వ్యాపారం ఊపందుకుంది. ప్రధాన కూడళ్లలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ​ప్రజలు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఒక్కో ప్రమిద ధర రూ. 20, డజను ధర రూ. 200 వరకు పలుకుతోంది. ప్రమిదలు కొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు తరలివస్తున్నారు.

October 20, 2025 / 04:50 PM IST

సల్మాన్ వివాదస్పద వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ బలోచిస్తాన్‌ను దేశంగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒక హిందీ సినిమాను సౌదీలో విడుదల చేస్తే అది కచ్చితంగా సూపర్‌హిట్ అవుతుందని పేర్కొన్నారు. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలైనా ఇక్కడ రూ.వందల కోట్లు సాధిస్తాయన్నారు. ఎందుకంటే బలోచిస్తాన్, ఆఫ్గాన్, పాక్ నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారు అని పేర్కొన్నారు.

October 20, 2025 / 04:49 PM IST

రోడ్డుపై ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్.. ట్రాఫిక్ జామ్

HYD: ఎంజే మార్కెట్ వద్ద సోమవారం మధ్యానం ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్ అవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.

October 20, 2025 / 04:47 PM IST

బాణాసంచా అమ్మకాలకు తాత్కాలిక అనుమతులు

WG: దీపావళి సందర్భంగా బాణాసంచా సామగ్రి అమ్ముకునేందుకు తాత్కాలిక 52 లైసెన్సులు మంజూరు చేసినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. భాస్కర్ రామమ్ తెలిపారు. నరసాపురం పట్టణంలోని నెక్లెస్ రోడ్లో 17 షాపులకు, మండలంలోని పలు గ్రామాల్లో 10, మొగల్తూరు మండలంలో 25 షాపులో నిర్వహించినందుకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

October 20, 2025 / 04:46 PM IST

దుకాణాలను అలంకరించిన వ్యాపారులు

MNCL: లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ఉన్న దుకాణాలను వ్యాపారులు అందంగా అలంకరించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని సోమవారం వారు తమ దుకాణాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. దుకాణాల ముందు అరటి చెట్ల పెట్టి పలు రకాల బల్బులను అలంకరించారు. పలు ప్రాంతాలలో వ్యాపారాలు లక్ష్మీ పూజలను ప్రారంభించారు.

October 20, 2025 / 04:46 PM IST

వీధి దీపాలకు మరమ్మతులు

KDP: ఖాజీపేట(M) ఆంజనేయ కొట్టాల గ్రామంలో వీధి దీపాలు మరమ్మతుకు గురి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ విషయమై పలుమార్లు న్యూస్‌లో ప్రచురితమైంది. సోమవారం గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి స్పందిస్తూ.. వెలగని వీధి దీపాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త దీపాలు అమర్చిలా చర్యలు చేపట్టారు. దీపాల సమస్య పరిష్కారం రావడం పట్ల ప్రజలు సంతోషించారు.

October 20, 2025 / 04:43 PM IST

అత్యంత విషపూరితమైన పాము హల్ చల్

SKLM: పలాస మండలం కాశీబుగ్గ జగన్నాథ సాగరం పక్కన నూతనంగా నిర్మాణం అవుతున్న ఇంట్లో అత్యంత భయంకర విషపూరితమైన పాము (రక్తపింజరి) సోమవారం హాల్చల్ చేసింది. బుసలు కొడుతూ అటు ఇటు తిరుగుతుండడంతో స్థానికులు చూసి భయాందోళన చెందారు. వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు రావడంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

October 20, 2025 / 04:40 PM IST

37వ రోజుకు చేరిన మత్స్యకారుల రిలే దీక్ష

AKP: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు నక్కపల్లి మండలం రాజయ్యపేటలో చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 37వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బల్క్ డ్రగ్ వర్క్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు అయితే తమ ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని తెలిపారు.

October 20, 2025 / 04:39 PM IST

‘క్రీడా పోటీలను దిగ్విజయం చేసిన అందరికీ కృతజ్ఞతలు’

SRD: పటాన్ చెరువు మైత్రి గ్రౌండ్‌లో 69వ రాష్ట్ర స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను దిగ్విజయంగా నిర్వహించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు పట్లోళ్ల హనుమంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గిరి గోస్వాములు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ..  ఈ పోటీలో 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు,1500 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొ...

October 20, 2025 / 04:38 PM IST

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న సీపీ

SDPT: కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని సిద్దిపేట CP విజయ్ కుమార్ దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద విద్యార్థులతో ఆశీర్వచనం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో AEO బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, చేర్యాల CI శ్రీనివాస్ పాల్గొన్నారు.

October 20, 2025 / 04:38 PM IST

‘బలరాం మృతి వారి కుటుంబానికి తీరని లోటు’

NLG: కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన పోలగోని బలరాం సోమవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కేతేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

October 20, 2025 / 04:37 PM IST