• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సాయం

GDWL: ఎంబీబీఎస్ విద్యార్థి హరిజన నవీన్ కుమార్‌కు వైద్య విద్య పూర్తయ్యే ఖర్చును మాజీ ఎంపీటీసీ పెద్ద గోపాల్ రెడ్డి అందజేశారు. సోమవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆ విద్యార్థి కుటుంబ సభ్యులకు ఈ సాయాన్ని అందించారు. పేద విద్యార్థికి సాయం చేయడం సంతోషంగా ఉందని గోపాల్ రెడ్డి అన్నారు.

October 20, 2025 / 07:11 PM IST

లైసెన్స్ సర్వేయర్‌గా ములుగు జిల్లా యువకుడు

MLG: తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆలం శ్రీను లైసెన్స్ సర్వేయర్‌గా ఎంపికై, ఇటీవల శిక్షణ పూర్తి చేశారు. ఈ క్రమంలో HYDలోని శిల్ప కళా వేదికలో జరిగిన లైసెన్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీను సర్వేయర్ లైసెన్స్ అందుకున్నారు. సందర్భంగా శ్రీనును పలువురు రాజకీయ నేతలు, ఆదివాసీ సంఘ నాయకులు అభినందించారు.

October 20, 2025 / 07:08 PM IST

‘అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలి’

అన్నమయ్య: రైల్వే కోడూరులో అధిక లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు సరిగా లేకపోవడం వంటి కారణాలతో జరిమానాలు విధించే అధికారులు, అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

October 20, 2025 / 07:06 PM IST

పోలీసుల ధైర్యానికి అభినందనలు: ఎమ్మెల్యే

NZB: జిల్లాలోని విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రమోదన్‌‌ను హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపి హతమార్చిన పోలీసు సిబ్బందికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రౌడీలపై ఇలాగే ఉక్కుపాదం మోపాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ఈ చర్య పోలీసులకు, ప్రజలకు భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

October 20, 2025 / 07:06 PM IST

‘డీఏ విషయంలో నిరాశ’

ELR: డీఏ అరియర్స్ ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత, మరణించిన తరువాత ఇస్తాననడం బాధాకరమని ఉంగుటూరు మండల UTF నాయకులు అన్నారు. ఆ మేరకు వారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు డీఏలు ఇవ్వవలసిన చోట కేవలం ఒకటే ప్రకటించటం ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. మండల నాయకులు రాంబాబు , జోగినాయుడు జిల్లా కార్యదర్శి శ్రీధర్ పేర్కొన్నారు.

October 20, 2025 / 07:04 PM IST

ఎస్‌జేఎస్‌ జర్నలిస్టుల దీపావళి వేడుకలు

VSP: గోపాలపట్నం సింహాద్రి జర్నలిస్టుల సొసైటీ (ఎస్‌జెఎస్‌) ఆధ్వర్యంలో జర్నలిస్టులు దీపావళి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా పశ్చిమ MLA గణబాబు హాజరై జర్నలిస్టులకు కానుకలు, హెల్త్ కార్డులు అందజేశారు. జర్నలిస్టుల ఐక్యానికి ఉత్సాహాన్ని పెంచేలా ఈ వేడుకలు సాగాయి.

October 20, 2025 / 07:04 PM IST

నాలుగు ప్రధాన పార్టీలవారు ఇక్కడినుంచే.!

ప్రకాశం: రాష్ట్రంలోని 4 ప్రధాన పార్టీలకు యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచే అధికార ప్రతినిధులుగా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న BJPకి కీలకమైన రాష్ట్ర మీడియా ప్రతినిధిగా ఏలూరి రామచంద్రారెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్‌బాబు, వైసీపీ అధికార ప్రతినిధి MLA చంద్రశేఖర్, జనసేన పార్టీ ప్రతినిధిగా గౌతంరాజులు Y.పాలెం కావటం విశేషం.

October 20, 2025 / 07:04 PM IST

నూతన బోర్ మోటార్ ప్రారంభం

MBNR: బాలానగర్ మండలం పలుగు మీది తండాలో బోర్ మోటార్ పాడవడంతో తండావాసులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. దీనిపై తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్ స్పందించి, కొత్త మోటార్ కొనుగోలుకు రూ. 25 వేలు విరాళంగా ఇచ్చారు. ఆదివారం తండావాసులు నూతన మోటార్‌ను బిగించగా, తాగునీటి సమస్య తీరిందని సంతోషం వ్యక్తం చేశారు.

October 20, 2025 / 07:03 PM IST

గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలి: సీఐటీయూ

PPM: ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు బి.వి. రమణ, గొర్లి వెంకటరమణ, రెడ్డి వేణు సోమవారం ఆందోళన చేపట్టారు. అద్దె బస్సు సిబ్బందికి ప్రమాద బీమా చేయించాలని, పార్సిల్ బుక్ చేసే వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

October 20, 2025 / 07:02 PM IST

ప్రమాద రహితంగా దీపావళి జరుపుకోవాలి: ఎస్సై

MHBD: దీపావళి పండుగను ఆనందంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ సూచించారు. టపాసులు పేల్చేటప్పుడు నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు పేల్చాలని, గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు, డీజిల్ వంటి ద్రవఇంధనాల సమీపంలో టపాసులు కాల్చరాదని సూచించారు. అనుమతి లేకుండా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయొద్దన్నారు.

October 20, 2025 / 07:01 PM IST

టపాసుల దుకాణాలను పరిశీలించిన సీఐ

సత్యసాయి: దీపావళి పండగను పురస్కరించుకుని ప్రజలు టపాసులు కొంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా పెనుకొండలో కాలేజీ గ్రౌండ్‌లో పెట్టిన టపాసుల షాపులను పెనుకొండ సీఐ రాఘవన్ పరిశీలించారు. టపాసుల షాపుల వద్ద నీరు, ఇసుక, అగ్నిమాపక నియంత్రణ పరికరాలు పెట్టుకోవాలని, జాగ్రత్తలు వహించాలని షాపుల నిర్వాహకులకు సూచించారు.

October 20, 2025 / 07:00 PM IST

చిగురుమామిడిలో రైతన్నకు కన్నీళ్లు

KNR: చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నా, కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతోనే నష్టం జరిగిందని రైతులు అంటున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.

October 20, 2025 / 07:00 PM IST

డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

PDPL: కమాన్ పూర్‌లో శ్రీపాద రావు విగ్రహం నుంచి పెంచికల్ పేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ఈ పనుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉండడంతో లారీలు, ఇతర భారీ వాహనాలు జూలపల్లి మీదుగా, రైల్వే ట్రాక్, పోతన కాలనీ మార్గంలో వెళ్లాలని సంబంధిత అధికారులు సూచించారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలన్నారు.

October 20, 2025 / 07:00 PM IST

ప్రభుత్వంపై ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత

AP: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు DA GOపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. GOను వెంటనే సవరించాలని UTF, APTF సంఘాలు కోరాయి. GO ద్వారా ఉద్యోగ విరమణ తర్వాత DA ఎరియర్స్ చెల్లిస్తామనడం సరికాదన్నాయి. చర్చల్లో ప్రస్తావనకు రాని అంశాలు GOలో చేర్చారని మండిపడ్డాయి. CPS ఉద్యోగులపై GOలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపాయి. తక్షణమే GO 60, 61లను సవరించాలని డిమాండ్ చేశాయి.

October 20, 2025 / 06:59 PM IST

ఎస్సైను కలిసిన MRPS నాయకులు

E.G: గోకవరం ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సై పవన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గోకవరం మండల అధ్యక్షుడు G. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అందులో భాగంగా సోమవారం ఎస్సైని కలిసినట్లు వారు పేర్కొన్నారు.

October 20, 2025 / 06:56 PM IST