• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ALERT: నేటి నుంచి పరీక్షలు ప్రారంభం

AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 10,57,899 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.537 కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష ఉ.9-మ.12 గంటల మధ్య జరగనుండగా.. విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ALL THE BEST STUDENTS!

February 23, 2026 / 05:59 AM IST

నేడు బద్వేలులో రెవెన్యూ క్లినిక్

KDP: బద్వేలు మండల MRO కార్యాలయంలో నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు MRO ఉదయ్ భాస్కర్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు RDO చంద్రమోహన్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.

February 23, 2026 / 05:40 AM IST

నేడు కడప కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం

కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్,జాయింట్ అధితి సింగ్‌తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.

February 23, 2026 / 05:37 AM IST

కష్టకాలంలో అండగా నిలిచిన వారికే ప్రాధాన్యత: ఎమ్మెల్యే

కాకినాడ జిల్లా జనసేన పార్టీ సమావేశం ఆదివారం సూర్యకళా మందిర్లో జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో క్రియాశీలక సభ్యత్వాన్ని రికార్డు స్థాయిలో పెంచాలని తీర్మానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండి, అధికారాన్ని దక్కించిన కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తామన్నారు.

February 23, 2026 / 05:30 AM IST

తిప్పేస్వామిని పరామర్శించిన ఎమ్మెల్యే సతీమణి

సత్యసాయి: మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు సతీమణి ఉమాదేవి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వైరల్ ఫీవర్ బారిన పడి కోలుకుంటున్న ఆయనను స్వగృహంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తిప్పేస్వామి త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

February 23, 2026 / 05:30 AM IST

ఈ నెల 25న బడి బస్సుల భద్రతపై సమావేశం: డీటీవో

కోనసీమ: ఈ నెల 25 వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అమలాపురంలో ఉన్న జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో బడి బస్సుల భద్రతపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా రవాణాధికారి దేశంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్, రవాణా, విద్యా శాఖలు సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

February 23, 2026 / 05:30 AM IST

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ సీఎండీ’

ATP: జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. వినియోగదారులు 89777 16661, 91547 90355 నంబర్లకు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని సూచించారు.

February 23, 2026 / 05:30 AM IST

అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

తూ.గో. జిల్లాలో అనూరియా (మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్యులతో ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. వ్యాధి వ్యాప్తి నివారణకు అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

February 23, 2026 / 05:30 AM IST

నేడు డయల్ యువర్ సీఎండీ

KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు APSPDCL,CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు ఉంటుందన్నారు. వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు.

February 23, 2026 / 05:12 AM IST

నేటి నుంచే ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ పరీక్షలు

NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పరీక్షలు వెల్లడించారు.

February 23, 2026 / 05:02 AM IST

కమలాపురంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

KDP: కమలాపురం మార్కెట్ యార్డులో ఏపీ మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి శనగలను పరిశీలించి, తూకాల్లో మోసాలు లేకుండా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి చంద్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 05:00 AM IST

62 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు

KDP: ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు కడప జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 33,664 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.1st ఇయర్ 17,100,2nd ఇయర్ 16,564 మంది విద్యార్థులు ఉన్నారు. KDP-20, PDTR-8, MYKR, PRMML, BDVLలో 4, PVLD, JMDలో 3, KMLPRM, KJPTలో 2, మిగతా ప్రాంతాల్లో  ఒకటి చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 04:40 AM IST

రాయచోటిలో వైభవంగా వీరభద్రస్వామి పారువేట

అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా అశ్వవాహనం పై పారువేటకు స్వామివారు బయలుదేరగా, దేవస్థానం నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. కోలాటాలు, మేళతాళాలు, డప్పులతో పారువేట ఉత్సవం సందడిగా జరిగింది. కార్యక్రమంలో రాయచోటి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:35 AM IST

కుప్పాలపల్లిలో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

KDP: వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ఎస్సై తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ మోసాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద కాల్స్‌పై 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 23, 2026 / 04:14 AM IST

ఫిబ్రవరి 23: సోమవారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం షష్ఠి: ఉ.10-03 తదుపరి సప్తమి; భరణి: సా.5-33 తదుపరి కృతిక; వర్జ్యం: తె.4-45 నుంచి 6-14 వరకు; దుర్ముహూర్తం: మ.12-36 నుంచి 1-22 వరకు, తిరిగి 2-55 నుంచి 3-41 వరకు; రాహుకాలం: ఉ.7-30 నుంచి 9 వరకు; సూర్యోదయం: ఉ.6.27; సూర్యాస్తమయం: సా6 గంటలకు.

February 23, 2026 / 01:20 AM IST