VSP: పరవాడ మండలంలో పలుగ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉదయం 9 గంటల నుంచి పర్యటిస్తారని కూటమి నాయకులు నాగిరెడ్డి చిన్నారావు తెలిపారు. రూ. 4. 40 కోట్లతో చేపడుతున్న జాజులవానిపాలెం-దళాయిపాలెం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం లంకెలపాలెం పైవంతెన, లంకెల పాలెం-పెదముషిడివాడ రహదారిని పరిశీలిస్తారన్నారు.
VSP: పరవాడ మండలంలో పలుగ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉదయం 9 గంటల నుంచి పర్యటిస్తారని కూటమి నాయకులు నాగిరెడ్డి చిన్నారావు తెలిపారు. రూ. 4. 40 కోట్లతో చేపడుతున్న జాజులవానిపాలెం-దళాయిపాలెం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం లంకెలపాలెం పైవంతెన, లంకెల పాలెం-పెదముషిడివాడ రహదారిని పరిశీలిస్తారన్నారు.
ATP: హోలీ రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. యశ్వంతపూర్ నుంచి ధన్‌బాద్‌కు ఈనెల 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి శనివారం వీక్లీ రైలు (06563) నడవనుంది. తిరుగు ప్రయాణంలో (06564) సోమవారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే యశ్వంతపూర్-హజ్రత్ నిజాముద్దీన్‌కు ఈనెల 25న ప్రత్యేక రైలు (06569) నడుస్తుందని అధికారులు తెలిపారు.
KRNL: మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు మూడో రోజైన శుక్రవారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి. యోగేంద్ర కళా మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. డాక్టర్ పద్మిని సంగీత కచేరి వీనులవిందుగా సాగగా, బెంగళూరుకు చెందిన నాటేశ్వర నృత్య కళాకారులు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.
MBNR: మూసాపేట మండలం ఆచ్చాయిపల్లి గ్రామానికి చెందిన నరేష్, మైబు అనే విద్యార్థులు హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. వారి ఉన్నత చదువులకు లాప్‌టాప్‌లు అవసరముందని బోయిని చంద్రశేఖర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
BHNG: తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేరులో శుక్రవారం ఆ సంఘం సభ్యుల సమావేశం కిష్టమ్మ అధ్యక్షతన నిర్వహించారు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు.
SKLM: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 23 వరకు జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సుమిత్ర కళా సమితి అధ్యక్షులు శంకరరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళా మందిరంలో స్వాగత ద్వారాలు, కళాకారులకు వసతికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. తిలకించేందుకు అందరూ రావచ్చన్నారు.
VZM: స్వచ్చాంధ్ర-స్వర్థాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ గంట్యాడ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ జీరో వేస్ట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్థానిక MPDO రమణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు వేరుగా అందించే విధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎక్కడ బడితే అక్కడ చెత్త వెయ్యవద్దన్నారు.
E.G: ప్రభుత్వ అధికారులు లంచం అడిగినా లేదా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు ప్రజలు భాగస్వాములు కావాలని, నేరుగా ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. 2004లో మహేశ్ అనే వ్యక్తికి మంజూరైన 5 సెంట్ల భూమి పట్టాను నిబంధనలకు విరుద్ధంగా వేరొకరికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ మండిపడ్డారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, బాధితుడికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
NRPT: జిల్లాలో 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హెచ్ఎంలతో సమావేశమై చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలని ఆమె సూచించారు.
PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ కుటుంబంలో జరిగిన గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రామూత్ కొబ్బరికాయలు కొట్టే కత్తితో శుక్రవారం బంధువులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు.
HYD: స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణమే లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సమగ్ర శానిటేషన్ & ఎంటమాలజీ సమీక్ష నిర్వహించారు. అన్ని వార్డుల జోనల్ కమిషనర్లు, డీసీలు, ఎస్ఈడబ్ల్యూఎం ఇంజినీర్లు, ఎస్ఎఫ్ఎలతో సమావేశమై ఉదయం 6 గంటలకు హాజరు నమోదు, 100% డోర్ టూ డోర్ చెత్త సేకరణ, డ్రై డే పాటింపు, యాంటీ లార్వల్ ఆపరేషన్లపై కఠిన ఆదేశాలు జారీ చేశారు.
TG: ఆచార్య నాగార్జున యునివర్సిటీ ఎదురుగా బీసీ సింహ గర్జన పేరుతో రేపు నిర్వహించనున్న బహిరంగ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభ నిర్వహణకు అనుమతిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
మార్కాపురం జిల్లా మండలంలోని చిన్న కంభం సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏ. ఈ వెంకట నరసయ్య తెలిపారు. చిన్న కంభం, దేవనగరం, గోవిందాపురం, దర్గా మరియు గచ్చు కాలువ ఫీడర్ పరిధిలోనిఅంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.