• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పట్టపగలే ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

BDK: బూర్గంపాడు మోరంపల్లిబంజర్ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా గురువారం సాయంత్రం గ్రామంలో పట్టపగలే బహిరంగంగా జరుగుతున్న ఇసుక లోడింగ్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.

February 26, 2026 / 05:56 PM IST

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపనలోపాల్గొన్న బీటెక్ రవి

KDP: వేంపల్లె(మం) నాగూరులో బుధవారం ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గురువారం టీడీపీ ఇంఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డికి ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

February 26, 2026 / 05:55 PM IST

పిన్నిపై లైంగిక వేధింపులు హత్యాయత్నం కేసు నమోదు

HNK: వేలేరు మండలం పరిధిలోని ఎర్రబెల్లిలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ధరావత్ రాజ్ కుమార్ (30) అనే యువకుడు తన పిన్నిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చి ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆగ్రహించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు.

February 26, 2026 / 05:55 PM IST

IND vs ZIM: ‘డ్యూ’తో ఇబ్బంది లేదు..!

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్, జింబాబ్వే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే, డ్యూ ప్రభావం మ్యాచ్‌ మీద పడకుండా ఉండటం కోసం స్టేడియం సిబ్బంది.. ‘డ్యూ కూర్‌’ అనే రసాయనాన్ని మైదానంలో స్ప్రే చేశారు. ఈ కెమికల్‌ను అమెరికా నుంచి తెప్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఫీల్డింగ్ టీమ్‌కు డ్యూతో ఇబ్బంది ఉండదు.

February 26, 2026 / 05:55 PM IST

అనంతగిరిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

ASR: అనంతగిరి మండలంలో కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. డముకు, నిమ్మలపాడు నుంచి పెద్దబిడ్డ వరకు జరుగుతున్న తారు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అనంతగిరి పీహెచ్‌సీని పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం చెరుకుబిడ్డ ఎంపీపీ పాఠశాల పరిశీలించారు

February 26, 2026 / 05:53 PM IST

పెద్దేముల్ ఎస్సై బదిలీ.. కొత్త ఎస్సై ఇతనే..!

VKB: పెద్దేముల్ మండల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శంకర్‌ను వికారాబాద్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో గతంలో ఇక్కడ పనిచేసిన ప్రశాంత్ వర్ధన్‌ను తిరిగి నియమించారు. ఎస్సై శంకర్ తన మూడు నెలల కాలంలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేసి ప్రజల మన్ననలు పొందారు. కాగా, కొత్తగా నియామకమైన ఎస్సై ఈరోజే బాధ్యతలు స్వీకరించనున్నారు.

February 26, 2026 / 05:53 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి

NGKL: కొల్లాపూర్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

February 26, 2026 / 05:53 PM IST

మహాకుంభమేళ తరహాలో పుష్కరాలు: ఆనం

AP: గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఈ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. మహాకుంభమేళ తరహాలో ఈ పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాలకు దాదాపు 8-10 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు.

February 26, 2026 / 05:53 PM IST

సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం పంచకట్టు

BDK: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన మూతి నాగరాజు రమణి దంపతుల కుమారులు మను శ్రీ విష్ణు వర్ధన్ దొర, రిత్విక్ శ్రీ వర్ధన్ దొరల పంచకట్టు వేడుక గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం పంచకట్టు వేడుక అని అన్నారు.

February 26, 2026 / 05:52 PM IST

మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం: సీతక్క

TG: మహిళ సాధికారతకు ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అలాగే కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని, 60ఏళ్లు నిండిన  వృద్ధులకు ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

February 26, 2026 / 05:51 PM IST

విజయవాడలో మూడో రోజు లెజిస్లేటివ్ క్రీడా పోటీలు

NTR: విజయవాడలో మూడో రోజు లెజిస్లేటివ్ క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. క్రికెట్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్, మ్యూజికల్ చైర్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, కబడ్డీ, చెస్, వాలీబాల్, షాట్‌పుట్, త్రోబాల్ పోటీలు నిర్వహించారు. వివిధ క్రీడల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీపడుతూ ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

February 26, 2026 / 05:50 PM IST

అన్నదాతలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

ELR: అన్నదాతలకు అండగా నిలిచేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల ధాటికి కామవరపుకోట మండలం తడికలపూడిలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను అడిగి పలు వివరాలను తెలుసుకున్నారు.

February 26, 2026 / 05:49 PM IST

చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు

VZM: చెక్కు బౌన్స్ కేసులో వ్యక్తికి జైలు జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ గురువారం తీర్పు చెప్పారు. గజపతినగరానికి చెందిన పూసర్ల రామలింగేశ్వర రావు అదే గ్రామానికి చెందిన కొల్లా కనక వెంకట సత్యనారాయణకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. ఈమేరకు రామలింగేశ్వరరావుకు ఏడాది జైలు శిక్షతోపాటు రెండు లక్షల 40 వేల రూపాయలు జరిమానా విధించారు.

February 26, 2026 / 05:49 PM IST

పన్నులు చెల్లించని షాప్స్‌కు తాళాలు వేసిన అధికారులు

కృష్ణా: గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్పీఎస్ బ్లాక్‌లోని షాప్స్ అద్దె/ లైసెన్స్ ఫీజులు భారీగా పెండింగ్లో ఉండడంతో అధికారులు గురువారం చర్యలు చేపట్టారు. పన్ను చెల్లించని కొంతమంది షాపులకు తాళాలు వేశారు. అన్ని షాపులో యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బకాయిలను చెల్లించి, అనవసర సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులు సూచించారు.

February 26, 2026 / 05:48 PM IST

‘నీటి సమస్య రానీయొద్దు’

NZB: రాబోయే వేసవిలో మండలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఇసుక సరఫరా జాప్యం లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

February 26, 2026 / 05:48 PM IST